IBomma Movies | మిడిల్ క్లాస్‌పై ఎంత ప్రేమ.. సినీ ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ
IBomma Movies | ఐ బొమ్మ.. ఈ పేరు గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు అంతగా పాపులర్ కావడానికి కారణం ఇందులో ఎలాంటి రుసుము చెల్లించకుండా హెచ్ డీ క్వాలిటీతో కొత్త సినిమాలు చూసే అవకాశం ఉండడమే. ఓటీటీలోకి వచ్చిన ప్రతీ సినిమా కొన్ని గంటల్లో ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతుంది. ఆయా ఓటీటీ ప్లాట్‌ఫాంలు తమ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులకి కొంత చార్జ్ చేస్తుండగా, ఇందులో మాత్రం ఫ్రీగా చూసే అవకాశం […]

IBomma Movies |
ఐ బొమ్మ.. ఈ పేరు గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు అంతగా పాపులర్ కావడానికి కారణం ఇందులో ఎలాంటి రుసుము చెల్లించకుండా హెచ్ డీ క్వాలిటీతో కొత్త సినిమాలు చూసే అవకాశం ఉండడమే. ఓటీటీలోకి వచ్చిన ప్రతీ సినిమా కొన్ని గంటల్లో ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతుంది.
ఆయా ఓటీటీ ప్లాట్‌ఫాంలు తమ కంటెంట్ చూసేందుకు ప్రేక్షకులకి కొంత చార్జ్ చేస్తుండగా, ఇందులో మాత్రం ఫ్రీగా చూసే అవకాశం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. రోజులు మారుతున్న కొద్దీ ఐబొమ్మ కూడా తన వెబ్ సైట్ లో మార్పులు చేస్తూ సినీ ఇండస్ట్రీకి సవాల్ విసురుతుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఈ వెబ్ సైట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో ఐబొమ్మ వారికి వార్నింగ్ ఇచ్చింది . మీరు మా మీద ఫోకస్ పెడితే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఐబొమ్మ పేరుతో వార్నింగ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా, ఇందులో తమ జోలికి వస్తే సీరియస్ రియాక్షన్ ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీని హెచ్చరించారు. ‘ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్స్ అమ్మిన తరవాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
1) హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది మీకు కొడుకు అయినా ఎవరు అయినా..
2) సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. వాళ్లు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరిచ్చే డబ్బులు ఏ కూలి పని చేసినా వస్తాయి. కానీ, మీ హీరోకి, హీరోయిన్‌కి వస్తాయా?
3) సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాలలో షూటింగ్‌లకు, ట్రిప్స్‌కి ఖర్చుపెడుతున్నారు.
4) ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు?
5) ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది..? ఇక్కడ వాళ్లకు ఉపాధి కలుగుతుంది కదా?
4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు.
5) డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్లు ఆ డబ్బును కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ ధర పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధ పడుతున్నాడు.
మా వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్లు రిలీజ్ చేసే వెబ్‌సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి e-సిగరెట్‌కు యూజర్స్‌ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కి నా రియాక్షన్ ఉంటుంది.
ఈ మిడిల్‌లో వేరే ఏ హీరో కూడా (ఉదాహరణ: విజయ్) టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్‌సైటు నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు వెంటనే డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించి నట్టు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరవాత తీసేయాలని అనుకుంటున్నాం.
ఐ బొమ్మ వాళ్లు ఇండియాలో తీసేసిన తరవాత వాళ్లను రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయమని కోరాము. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్ చేయడం లేదు. మేము http://ibomma.net వాళ్లంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి. అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులోనూ తెలుగు వారి కోసం ఆలోచిస్తాం’ అని ఐబొమ్మ తాము ఇచ్చిన వార్నింగ్ లేఖలో పేర్కొంది.