Site icon vidhaatha

Karnataka Elections Result | కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బావుణ్ణు.. ఏపీ నాయకుల మనోగతం

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. రేపు ఫలితాలు (Karnataka Elections Result) రానున్నాయి... అయితే అక్కడ ఎలాగు కాంగ్రెస్ వస్తుందని అక్కడి ప్రజలు భావిస్తుండగా ఎగ్జిట్ పోల్స్ సైతం అదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సరే వాళ్ళ రాష్ట్రం కాబట్టి వారి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి.. మరి పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ కర్ణాటక ఎన్నికల గురించి ఏమనుకుంటోంది అన్నది చుస్తే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని, అదే గెలవాలని ఏపీ రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు.

ఎందుకంటే గత పదేళ్లుగా ఎదురులేని అధికారంతో బీజేపీ చేస్తున్న దారుణాలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తూనే ఉన్నారు. ఎలాగోలా అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎలా దూకుడుగా వెళ్లి నాయకుల మీద విరుచుకుపడుతోందో అందరికి తెలుసు.

కాబట్టి కేంద్రంలో ఎలా ఉన్నా కానీ కర్ణాటకలో బీజేపీ ఒడిపితే వారికీ కాస్త దిద్దుబాటు చర్య మొదలవుతుందని, దూకుడు తగ్గుతుందని ఆంధ్ర నాయకులు భావిస్తున్నారు. తాను ఎంత మొత్తుకుంటున్నా పొత్తుకు రావడం లేని బీజేపీ ఈసారి కర్ణాటకలో ఓడిపోవాలని చంద్రబాబు మనసారా కోరుకుంటున్నారు. అప్పుడైనా ఆంధ్రాలో తనతో పొత్తుకు వస్తారేమో అని ఆయన ఆశ.

ఇక సీఎం జగన్ సైతం అక్కడ బీజేపీ ఓడిపోతే కాస్త జోరు తగ్గుతుందని, ఆంధ్ర విషయంలో తనకు కాస్త తెర వెనుక అయినా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలమీద కూడా ఉంటుందని, కాబట్టి బీజేపీ కాస్త జోరు తగ్గించి తమలాంటి ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆశపడుతున్నారు.

ఇక పవన్ ఐతే ఎలాగు బీజేపీ ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసి చంద్రబాబుతో కలుస్తున్నారు కాబట్టి ఆయన కూడా చంద్రబాబు మనసుతోనే ఆలోచిస్తున్నారు. తాను ఎంత చెప్పినా చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు.

కాబట్టి ఈసారి కర్ణాటకలో ఎలాగైనా బీజేపీ ఓడిపోవాలన్నది ఆయన మనోభీష్టం.. హమ్మయ్య నా మాట వినలేదు.. అక్కడ భలేగా ఓడిపోయారు అని లోలోన సంతోష పడేందుకు ఆ ఓటమి పవన్ కు ఏంటో బూస్టప్ ఇస్తుంది. ఇలా ఒక్కో పార్టీ ఆలోచన ఒక్కోలా ఉంది. చూడాలి ఏమవుతుందో.. కర్ణాటకలో ఎవరు గెలుస్తారో.

Exit mobile version