Ind vs Wi:త‌క్కువ స్కోర్‌కే డిక్లేర్ చేసిన టీమిండియా.. విజ‌యానికి మ‌రో ఎనిమిది వికెట్స్

Ind vs Wi: వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్‌లో కూడా గెలుపు దిశ‌గా దూసుకుపోతుంది. వ‌రుణుడు ప‌దే ప‌దే అంత‌రాయం క‌లిగిస్తున్న‌ప్ప‌టికీ టీమిండియా జ‌ట్టు విజ‌యానికి చాలా ద‌గ్గ‌ర‌గా వచ్చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జ‌ట్టు 255 ప‌రుగులకి ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌కి 183 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఇషాన్ కిష‌న్ మెరుపు […]

  • By: sn    latest    Jul 24, 2023 12:36 AM IST
Ind vs Wi:త‌క్కువ స్కోర్‌కే డిక్లేర్ చేసిన టీమిండియా.. విజ‌యానికి మ‌రో ఎనిమిది వికెట్స్

Ind vs Wi: వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్‌లో కూడా గెలుపు దిశ‌గా దూసుకుపోతుంది. వ‌రుణుడు ప‌దే ప‌దే అంత‌రాయం క‌లిగిస్తున్న‌ప్ప‌టికీ టీమిండియా జ‌ట్టు విజ‌యానికి చాలా ద‌గ్గ‌ర‌గా వచ్చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జ‌ట్టు 255 ప‌రుగులకి ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌కి 183 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భార‌త్ వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఇషాన్ కిష‌న్ మెరుపు ఇన్నింగ్స్ తో అర్ధ సెంచ‌రీ పూర్తి చేయ‌డంతో 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ క్ర‌మంలోనే విండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది..

లక్ష్యఛేదనలో భాగంగా వెస్టిండీస్, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లు బ్యాటింగ్ చేసి 2 వికెట్లు కోల్పోయి కేవ‌లం 76 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. ఇక రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు కావాల్సి ఉండగా టీమిండియా విజ‌యానికి మరో 8 వికెట్లు కావాలి. వ‌రుణుడు ప‌దే ప‌దే అంత‌రాయం క‌లిగిస్తుండ‌డంతో మ్యాచ్ ఫలితంపై కొంత సందేహాలు ఉన్నాయి. ఐదో రోజు రెండు సెషన్ల పాటు ఆట జ‌రిగిన భార‌త్ మిగ‌తా ఎనిమిది వికెట్స్ ద‌క్కించుకునే ఛాన్స్ ఉంది. రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసి ఔట‌య్యారు. ఫస్ట్ డౌన్లో వచ్చిన శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో ఓ ఫోర్‌తో 29 పరుగులు చేశాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ ప్ర‌మోష‌న్ ద‌క్కించుకున్న ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి టెస్టుల్లో త‌న మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగానే మ‌ళ్లీ వ‌ర్షం మొద‌లు కాగా, కాసేప‌టి త‌ర్వా విండీస్ బ్యాటింగ్‌కి దిగింది. క్రెగ్ బ్రాత్‌వైట్, టగెనరైన్ చంద్రపాల్ ఇద్ద‌రు కూడా 18 ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్త‌గా ఆడారు. కాని అశ్విన్ రంగంలోకి దిగ‌డంతో 52 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన క్రెగ్ బ్రాత్‌వైట్ ని తొలి వికెట్‌గా ఔట్ చేశాడు. ఇక నాలుగు బంతులు ఆడి పరుగులేమీ చేయలేకపోయిన కిర్క్ మెక్‌కెంజీ కూడా అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట‌య్యాడు.. ప్ర‌స్తుతం చంద్రపాల్ 24, బ్లాక్‌వుడ్ 20 పరుగులతో క్రీజులో ఉండ‌గా, వీరు భార‌త బౌల‌ర్స్‌ని ధీటుగా ఎదుర్కొని భార‌త్ విజ‌యానికి అడ్డుప‌డ‌తారా లేదా అనేది చూడాలి.