India vs West IndiesI 2nd Test | ఫాలోఆన్ లో వెస్టిండీస్ ఎదురీత

ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఫాల్ ఆన్ లో ఓటమిని తప్పించుకునేందుకు ఎదురీదుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | క్రీడలు | Oct 12, 2025, 6:01 pm IST
Read Time: 3 mins
India vs West IndiesI 2nd Test | ఫాలోఆన్ లో వెస్టిండీస్ ఎదురీత

విధాత: ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో భారత్ – వెస్టిండీస్(India vs West Indies 2nd Test)మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ఫాల్ ఆన్ లో(follow-on ) ఓటమిని తప్పించుకునేందుకు ఎదురీదుతుంది. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248కి అలౌట్..ఫాలోఆన్ ఆడుతుంది. రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 175/2 పరుగులతో ఉంది. ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 518/5 కి విండీస్ 97పరుగులు వెనుకబడి ఉంది.

మూడో రోజు ఆటను 4వికెట్లకు 140పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన విండీస్ స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్(5/82) మయాజాలానికి ఎదురీదలేక వరుస వికెట్లు కోల్పోయి..చివరకు 81.5ఓవర్లలోనే 248పరుగులకు అలౌటైంది. దీంతో 270 పరుగులు వెనుకబడి ‘ఫాలో ఆన్‌’ ఎదుర్కొంటుంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మూడో రోజు ఆటలో విండీస్ బ్యాటర్లు షై హోప్ 36, టెవిన్ ఇమ్లాక్ 21, అండర్సన్ ఫిలిప్ 24 నాటౌట్, జస్లిన్ గ్రేవెస్ 17, క్యేరి పియెరీ 23, వారికన్ 1, జొడెన్ సీలెస్ 13 పరుగులకు అవుటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లలో అథనాజ్ (41) టాప్ స్కోరర్‌ గా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, 5, జడేజా 3, బూమ్రా, సిరాజ్ చెరో వికెట్ సాధించారు. విండీస్ టెయిలెండర్లు పియరీ – ఫిలిప్‌ జోడీ తొమ్మిదో వికెట్ 46, పదో వికెట్ కు సీలెస్- ఫిలిప్ 27పరుగులు జోడించి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఆ తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాన్ కాంప్ బెల్ 87 నాటౌట్, షై హోప్ 66పరుగులతో రాణించి ఆదుకున్నారు. కాంప్‌బెల్, షైయ్ హోప్ జంట మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని (207 బంతుల్లో) నెలకొల్పింది.అథెంజ్ 7, చందర్ పాల్ 10పరుగులకు ఔటయ్యారు. సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ సాధించారు.