Coronavirus | క‌రోనా విజృంభ‌ణ‌.. 24 గంట‌ల్లో 6,050 పాజిటివ్ కేసులు న‌మోదు

Coronavirus | దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,050 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. నిన్న ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు 5,335 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ కేసుల‌తో పోల్చితే గ‌త 24 గంట‌ల్లో 13 శాతం కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 16వ తేదీన 6000 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌ళ్లీ ఆ రికార్డు ఇవాళ బ్రేక్ అయింది. […]

Coronavirus | క‌రోనా విజృంభ‌ణ‌.. 24 గంట‌ల్లో 6,050 పాజిటివ్ కేసులు న‌మోదు

Coronavirus | దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 6,050 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. నిన్న ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు 5,335 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ కేసుల‌తో పోల్చితే గ‌త 24 గంట‌ల్లో 13 శాతం కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 16వ తేదీన 6000 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌ళ్లీ ఆ రికార్డు ఇవాళ బ్రేక్ అయింది.

క‌రోనా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూఖ్ మాండ‌వీయ ఇవాళ మ‌ధ్యాహ్నం అన్ని రాష్ట్రాల‌, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో అత్యున్న‌త స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. కొవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

ఇక నిన్న ఒక్క‌రోజే క‌రోనాతో 14 మంది మృతి చెంద‌గా, మృతుల సంఖ్య 5,30,943కు చేరింది. మ‌హారాష్ట్ర‌లో ముగ్గురు, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌లో ఇద్ద‌రు చొప్పున‌, ఢిల్లీ, హ‌ర్యానా, గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జ‌మ్మూక‌శ్మీర్, పంజాబ్, కేర‌ళ‌ నుంచి ఒక్కొక్క‌రి చొప్పున మృతి చెందారు.

డైలీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 25,587 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 4.47 కోట్ల క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. రిక‌వ‌రీ రేటు 98.75 శాతంగా ఉంది.