IPL-2023 | ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు షాక్.. టోర్నీకి దూరమైన బెయిర్‌స్టో
IPL-2023 | ధనాధన్ క్రికెట్‌గా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ నెల 30న ప్రారంభంకానున్నది. ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సీజన్ ప్రారంభానికి ముందై పంజాబ్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ ఆటగాడు గాయం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు సైతం దూరంగా ఉన్నాడు. దాంతో బెయిర్‌స్టో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెట్ మాథ్యూ షార్ట్‌ని జట్టులోకి తీసుకున్నది. […]

IPL-2023 | ధనాధన్ క్రికెట్‌గా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ నెల 30న ప్రారంభంకానున్నది. ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సీజన్ ప్రారంభానికి ముందై పంజాబ్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ ఆటగాడు గాయం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు సైతం దూరంగా ఉన్నాడు. దాంతో బెయిర్‌స్టో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెట్ మాథ్యూ షార్ట్‌ని జట్టులోకి తీసుకున్నది. ‘గాయం కారణంగా బెయిర్‌స్టో ఈ సీజన్‌లో ఐపీఎల్ పాల్గొనడం లేదని చెప్పేందుకు చింతిస్తున్నాం. తర్వాత సీజన్‌లో జట్టులో అతన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నాం.
అతని స్థానంలో మాథ్యూ షార్ట్‌ని జట్టులోకి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అంటూ పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. మాథ్యూ ష్టార్ బిగ్‌బాష్ చివరి సీజన్‌లో రాణించాడు. అడిలైడ్ స్ట్రయికర్స్ తరఫున 14 మ్యాచుల్లో 35.23 సగటుతో 458 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు అర్థ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 100 నాటౌట్. అంతే కాకుండా బౌలింగ్ వేసి 11 వికెట్లు తీశాడు. 67 టీ20 మ్యాచ్‌లు ఆడిన షార్ట్ 64 ఇన్నింగ్స్‌ల్లో 1,409 పరుగులు చేశాడు. అదే సమయంలో 22 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలి మ్యాచ్‌ని ఏప్రిల్ 1న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.