IPL | పిచ్చి పట్టలేదు.. చెన్నై గెలిచిందని అలా చేశాడు

IPL | విధాత: న‌రాలు తెగే ఉత్కంఠ‌తో సాగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో చివ‌రి బంతికి చెన్నై విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ గెలుపుతో ప్ర‌తి ధోని అభిమాని గాల్లో తేలి పోయాడు. తాజాగా ఆ గెలుపున‌కు ఓ సీఎస్‌కే వీరాభిమాని త‌న‌దైన శైలిలో స్పందించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ హాస్ట‌ల్ రూంలో తీసిన వీడియో అది. చివ‌రి బంతికి జ‌డేజా ఫోర్ కొట్ట‌గానే.. స‌ద‌రు విద్యార్థి గాల్లో పిచ్చెక్కిన‌ట్లు అరుస్తూ.. త‌లుపుల‌ను ద‌బాద‌బా […]

  • By: krs    latest    Jun 01, 2023 8:15 AM IST
IPL | పిచ్చి పట్టలేదు.. చెన్నై గెలిచిందని అలా చేశాడు

IPL |

విధాత: న‌రాలు తెగే ఉత్కంఠ‌తో సాగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో చివ‌రి బంతికి చెన్నై విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ గెలుపుతో ప్ర‌తి ధోని అభిమాని గాల్లో తేలి పోయాడు. తాజాగా ఆ గెలుపున‌కు ఓ సీఎస్‌కే వీరాభిమాని త‌న‌దైన శైలిలో స్పందించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఓ హాస్ట‌ల్ రూంలో తీసిన వీడియో అది. చివ‌రి బంతికి జ‌డేజా ఫోర్ కొట్ట‌గానే.. స‌ద‌రు విద్యార్థి గాల్లో పిచ్చెక్కిన‌ట్లు అరుస్తూ.. త‌లుపుల‌ను ద‌బాద‌బా బాదేశాడు. సహ‌చ‌రులు ఆప‌డానికి ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

దీనిపై ప‌లువురు విభిన్నంగా స్పందించాడు. ఇత‌డిలో వైబ్రేట‌ర్ మోడ్ ఆన్ అయింద‌ని ఓ యూజ‌ర్ స్పందించ‌గా.. అమ్మాయిల‌కే భావోద్వేగాలు ఉంటాయ‌ని ఎందుకంటారు.. ఓ సారి ఇత‌డిని చూడండి అని ఓ యువ‌తి వ్యాఖ్యానించింది.