Dalit Students | ఇది మా దారి.. ద‌ళిత విద్యార్థుల‌ను అడ్డుకున్న వృద్దురాలు..!

Dalit Students | దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 80 ఏండ్లు కావొస్తున్న‌ప్ప‌టికీ ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంది. నాగ‌రిక స‌మాజంలోనే అనాగ‌రికంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు కొంత మంది అగ్ర కుల‌స్తులు. ఇది మా దారి అంటూ.. ద‌ళిత విద్యార్థుల‌ను ఓ వృద్ధురాలు అడ్డుకుంది.

Dalit Students | ఇది మా దారి.. ద‌ళిత విద్యార్థుల‌ను అడ్డుకున్న వృద్దురాలు..!

Dalit Students | చెన్నై : దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 80 ఏండ్లు కావొస్తున్న‌ప్ప‌టికీ ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంది. నాగ‌రిక స‌మాజంలోనే అనాగ‌రికంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు కొంత మంది అగ్ర కుల‌స్తులు. ఇది మా దారి అంటూ.. ద‌ళిత విద్యార్థుల‌ను ఓ వృద్ధురాలు అడ్డుకుంది. ఈ కుల వివ‌క్ష‌ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రం తంజావూరు తాలుకాలోని కొల్లంగరై గ్రామంలో వెలుగు చూసింది.

కొల్లంగ‌రై గ్రామానికి చెందిన కొంత మంది ద‌ళిత విద్యార్థులు కాలిన‌డ‌క‌న త‌మ నివాసాల‌కు న‌డుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఓ వృద్ధురాలు ఆ ద‌ళిత విద్యార్థుల‌ను అడ్డుకుంది. అంట‌రాని కులంలో పుట్టిన మీరు.. మేం న‌డిచే బాట‌లో న‌డుస్తారా..? అని దూషిస్తూ.. ఆ పిల్ల‌ల‌పైకి క‌ట్టెతో వృద్ధురాలు తిర‌గ‌బ‌డింది. ద‌ళిత పిల్ల‌ల‌ను దూషిస్తూ నడిరోడ్డుపై అవ‌మానించింది ఆమె. ఈ ఘ‌ట‌న‌ను ఓ విద్యార్థి త‌న సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

వృద్ధురాలి తీరుపై నెటిజన్లు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లాలంటే దళితవాడకు చెందిన పిల్లలు చెరువు చుట్టూ తిరిగి ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. కానీ చెరువు ఇవతలివైపు దారిలో వెళ్తే అర కిలోమీటర్‌ ప్రయాణంతో ఇళ్లకు చేరుకోవచ్చు. దాంతో బడి వదలగానే దళిత పిల్లలు దగ్గరిదారిలో వెళ్లేందుకు వచ్చారు. దాంతో వృద్ధురాలు వారిని అడ్డుకుంది.

వీడియో వైరల్ కావడంతో దళితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వృద్ధురాలిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే వృద్ధురాలిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.