Amir Khan | పెళ్లికి ముందే ప్రియుడితో హ‌నీమూన్.. హీరో కూతురిపై దారుణ‌మైన ట్రోల్స్

Amir Khan | బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన కెరీర్ చాలా ఉన్న‌తంగా ఉన్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం డిస్ట్ర‌బ్ అయింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్‌కి రెండు క‌లిసి రాలేదు. రీనా ద‌త్తాని ముందుగా వివాహం చేసుకున్న అమీర్ కొన్నాళ్ల‌కి ఆమెకి బ్రేక‌ప్ చెప్పాడు. ఆ త‌ర్వాత కిర‌ణ్ రావుని వివాహం చేసుకోగా, ఆమెకి గ‌త […]

  • Publish Date - August 28, 2023 / 05:41 AM IST

Amir Khan |

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన కెరీర్ చాలా ఉన్న‌తంగా ఉన్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం డిస్ట్ర‌బ్ అయింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్‌కి రెండు క‌లిసి రాలేదు.

రీనా ద‌త్తాని ముందుగా వివాహం చేసుకున్న అమీర్ కొన్నాళ్ల‌కి ఆమెకి బ్రేక‌ప్ చెప్పాడు. ఆ త‌ర్వాత కిర‌ణ్ రావుని వివాహం చేసుకోగా, ఆమెకి గ‌త ఏడాది విడాకులు ఇచ్చాడు. అయితే అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. కానీ అమీర్ ఖాన్ కూతురు మాత్రం డేటింగ్ చేస్తూ నానా ర‌చ్చ‌ చేస్తుంది.

అమీర్ ఖాన్(కూతురిగా ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. సోషల్ మీడియాలో తాను పెట్టే హాట్ హాట్ ఫొటోలతో ఆమెకి సినిమాల‌లోకి రాకుండానే మంచి పాపులారిటీ ద‌క్కింది. ఐరా ఖాన్ గత రెండేళ్లుగా నుపుర్ శిఖర్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. అత‌ను ఫిట్‌నెస్ ట్రైనర్, సైక్లిస్ట్ కాగా, గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో వీరిద్ద‌రికి నిశ్చితార్థం అయింది.

ఇరు కుటుంబాలు నుపూర్ ప్రేమ‌కి ఓకే చెప్ప‌డంతో వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని అంద‌రు ఎదురు చూస్తున్న స‌మ‌యంలో హనీమూన్ ట్రిప్ వేసి అంద‌రికి షాక్ ఇచ్చారు. ఐరా త‌న ఇన్‌స్టాలో హ‌నీమూన్ ఫోటోలని షేర్ చేయ‌డంతో అవి నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఐరా, నుపుర్ ప్రకృతి మధ్య హ్యాపీగా గడుపుతూ సంద‌డి చేస్తున్నారు. చెట్ల మధ్యలో ఉన్న ఓ బెడ్ పై ఐరా, నుపుర్ కలిసి ఫొటోల‌కి పోజులు ఇవ్వ‌గా,ఈ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో పెళ్ళికి ముందే డేటింగ్ పేరుతో జంటలు తెగ తిరిగేస్తుంటారు. వారి బాట‌లోనే ఈ జంట కూడా ప‌య‌నిస్తుంది.

ఐరా ఖాన్, నుపుర్ ఇలా హనీమూన్ ట్రిప్స్ వేస్తుండటంతో కొంద‌రు వారికి స‌ల‌హాలు ఇస్తున్నారు. త్వ‌ర‌గా పెళ్లి చేసుకోమ‌ని సూచిస్తున్నారు. కాగా, 25 ఏళ్ళ ఐరా ఖాన్.. అమీర్, రీనా దత్త లకు సంతానం అనే విష‌యం తెలిసిందే. జునైద్ ఖాన్ కూడా వీళ్లిద్దరికి జ‌న్మించిన సంతాన‌మే.

Latest News