Aamir Khan | పాత్ర కోసం పరిమితులు లేవు.. మేనల్లుడి సినిమాకు 18 కేజీలు తగ్గిన అమీర్ ఖాన్!
Aamir Khan | సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు తెరపై ఆకర్షణీయంగా కనిపించాలంటే ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అయితే కొందరు నటులు పాత్రల డిమాండ్ మేరకు కేవలం ఫిట్‌గా ఉండడమే కాకుండా, అవసరమైతే భారీగా బరువు పెరగడం లేదా తగ్గడం ద్వారా తమ అంకితభావాన్ని నిరూపిస్తుంటారు.
Aamir Khan | సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు తెరపై ఆకర్షణీయంగా కనిపించాలంటే ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అయితే కొందరు నటులు పాత్రల డిమాండ్ మేరకు కేవలం ఫిట్‌గా ఉండడమే కాకుండా, అవసరమైతే భారీగా బరువు పెరగడం లేదా తగ్గడం ద్వారా తమ అంకితభావాన్ని నిరూపిస్తుంటారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఇందుకు బెస్ట్ ఉదాహరణ. ప్రతి సినిమాకు భిన్నమైన లుక్‌తో పాటు అవసరమైతే కఠినమైన డైట్, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లతో పూర్తిగా మారిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా బక్కచిక్కిన లుక్‌లో కనిపిస్తూ చర్చనీయాంశంగా మారారు.
ఇప్పుడు ఇదే కోవలో బాలీవుడ్ సూపర్ స్టార్, నిర్మాత అమీర్ ఖాన్ కూడా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట ఇది ఆయన తదుపరి ప్రధాన చిత్రానికి సంబంధించిన మేకోవర్ అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత చాలామంది నోరెళ్లబెడుతున్నారు. అమీర్ ఖాన్ ఈ బరువు తగ్గడం తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హ్యాపీ పటేల్’ సినిమా కోసమే అని తెలుస్తోంది.
ప్రస్తుతం అమీర్ ఖాన్ కొత్త ప్రాజెక్టుల షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విరామ సమయంలోనే ప్రత్యేక డైట్, ఫిట్‌నెస్ రూటీన్‌ను అనుసరించి 18 కేజీలు తగ్గారట. ‘హ్యాపీ పటేల్’ సినిమాలో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నప్పటికీ, అది ఓ కీలకమైన కామెడీ క్యారెక్టర్ అని సమాచారం. ఆ పాత్రకు సరిపోయే లుక్ కోసం అమీర్ ఈ స్థాయిలో బరువు తగ్గారని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న పాత్ర అయినా సరే, తన స్టాండర్డ్స్‌కు తగ్గట్టే పూర్తిగా సిద్ధమవ్వాలనే అమీర్ తత్వమే ఇందుకు కారణమని అంటున్నారు.
ఈ విషయం తెలిసిన అభిమానులు “అతిథి పాత్ర కోసం ఇంత కమిట్‌మెంట్ అంటే ఇదే అమీర్ ఖాన్” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. పాత్ర చిన్నదా పెద్దదా అన్నది కాదు, తన నటన, లుక్‌పై పూర్తి నిబద్ధత చూపించడమే ఆయన ప్రత్యేకతగా మరోసారి నిరూపితమైంది.
ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ చేతిలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. భారతీయ సినిమాకు పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే రాజ్ కుమార్ హిరానీ–అమీర్ ఖాన్ కాంబినేషన్‌లో గతంలో సంచలన విజయం సాధించిన ‘3 ఇడియట్స్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆ సినిమాకు కొనసాగింపుగా రానున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాత్ర కోసం 18 కిలోలు తగ్గిన అమీర్ ఖాన్ కమిట్‌మెంట్ చూస్తే, రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని సర్‌ప్రైజ్‌లు రావడం ఖాయమనే చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram