Cannes | మెడ‌కు ఉరి తాడుతో.. కేన్స్‌లో ఇరాన్ భామ‌

Cannes | విధాత: ముద్దుగుమ్మ‌ల అందాల‌తో నిండిపోయే కేన్స్ వేడుక‌లో.. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొద‌ల‌యింది. వివిధ అంశాల‌కు మ‌ద్ద‌తుగానో.. నిర‌స‌న‌గానో కొంత మంది భామ‌లు త‌మ వ‌స్త్రధార‌ణ‌ను డిజైన్ చేయించుకుని రెడ్ కార్పెట్‌పై హొయ‌లు పోతున్నారు. ఇది వ‌ర‌కు ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు నిర‌స‌న‌గా ఓ తార ఉక్రెయిన్ జెండా రంగుల‌తో కూడిన గౌన్ వేసుకుని కేన్స్‌లో తళుక్కుమంది. View this post on Instagram A post shared by MAHLAGHA […]

  • By: krs    latest    Jun 01, 2023 8:30 AM IST
Cannes | మెడ‌కు ఉరి తాడుతో.. కేన్స్‌లో ఇరాన్ భామ‌

Cannes |

విధాత: ముద్దుగుమ్మ‌ల అందాల‌తో నిండిపోయే కేన్స్ వేడుక‌లో.. ఇప్పుడు కొత్త ట్రెండ్ మొద‌ల‌యింది. వివిధ అంశాల‌కు మ‌ద్ద‌తుగానో.. నిర‌స‌న‌గానో కొంత మంది భామ‌లు త‌మ వ‌స్త్రధార‌ణ‌ను డిజైన్ చేయించుకుని రెడ్ కార్పెట్‌పై హొయ‌లు పోతున్నారు.

ఇది వ‌ర‌కు ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు నిర‌స‌న‌గా ఓ తార ఉక్రెయిన్ జెండా రంగుల‌తో కూడిన గౌన్ వేసుకుని కేన్స్‌లో తళుక్కుమంది.

తాజాగా ఇరాన్‌లో వ‌ర‌స ఉరిశిక్ష‌ల‌కు నిర‌స‌న‌గా ఇరానియ‌న్ మోడ‌ల్ మహ్‌ల‌ఘా జ‌బేరీ.. మెడ‌కు ఉరితాడు వేసుకుని కేన్స్ రెడ్ కార్పెట్‌పై ప్ర‌త్య‌క్ష మ‌యింది.

ఈ దుస్తుల్లో త‌న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన జ‌బేరీ… ఉరిశిక్ష‌ల‌ను ఆపండి అని ట్యాగ్‌లైన్‌నూ జ‌త చేసింది.