IRCTC Char Dham Yatra | చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే మరి..!

IRCTC Char Dham Yatra | చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నది. చార్‌ధామ్‌ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ధామ్‌ తెరుచుకోనున్నాయి. దాదాపు ఆరు నెలల పాటు యాత్ర కొనసాగనున్నాయి. చార్‌ధామ్‌ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మే 1, మే 15, జూన్ 1, జూన్ 15, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ […]

IRCTC Char Dham Yatra | చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే మరి..!

IRCTC Char Dham Yatra |

చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నది. చార్‌ధామ్‌ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ధామ్‌ తెరుచుకోనున్నాయి. దాదాపు ఆరు నెలల పాటు యాత్ర కొనసాగనున్నాయి. చార్‌ధామ్‌ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

మే 1, మే 15, జూన్ 1, జూన్ 15, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 15 తేదీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. 11 రాత్రులు, 12 రోజుల పాటు ప్యాకేజీలో పర్యటించేందుకు అవకాశం ఉంది. ఇందులో కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిని సందర్శించొచ్చు. అయితే, ప్యాకేజీలో బుక్‌ చేసుకునే పర్యాటకులు తొలుత చార్‌ధామ్‌ యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉండాలని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

యాత్ర సాగుతుందిలా..

ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ యాత్ర తొలి రోజు ఢిల్లీలో ప్రారంభం మొదలవుతుంది. రోడ్డు మార్గంలో హరిద్వార్ బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి వరకు హరిద్వార్‌ చేరుకొని.. రెండోరోజు హరిద్వార్ నుంచి బార్‌కోట్ బచయలుదేరాలి. మూడోరోజు యమునోత్రి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పర్యాటకులు సొంత ఖర్చులతో పోని, పల్లకీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగో రోజు ఉత్తరకాశీ బయలుదేరాల్సి ఉంటుంది. బ్రహ్మకాల్ దగ్గర ప్రకటేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

సాయంత్రం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు రాత్రి ఇక్కడే బస చేయాలి. ఐదో రోజు గంగోత్రి బయలుదేరుతారు. భగీరథి నది గుండా ప్రయాణం సాగుతుంది. గంగోత్రి ఆలయంలో గంగాదేవీ దర్శనం చేసుకొని.. ఆరో రోజు గుప్తకాశీ, సీతాపూర్ బయల్దేరాల్సి ఉంటుంది.

ఏడో రోజు సోన్‌ప్రయాగ్ దగ్గర కేదార్‌నాథ్ వెళ్లేందుకు పోనీ లేదంటే పల్లకీ సేవలను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం కేదార్‌నాథ్ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి దర్శనం చేసుకొని రాత్రికి కేదార్‌నాథ్‌లో బస చేయాలి. ఎనిమిదో రోజు కేదార్‌నాథ్ అలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని.. ఆ తర్వాత గుప్తకాశీ బయలుదేరాల్సి ఉంటుంది.

9వ రోజు బద్రీనాథ్‌కు..

ఇక తొమ్మిదో రోజు బద్రీనాథ్ బయలుదేరి.. దారిలో జోషీమఠ్‌లో నర్సింగ్ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం వరకు బద్రీనాథ్ చేరుకుంటారు. ఆ తర్వాత బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకొని.. రాత్రికి అక్కడే బస చేయాల్సి ఉంటుంది. పదో రోజు బద్రీనాథ్ ఆలయంలో అభిషేకం, అలంకార దర్శనాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

11వ రోజు రోజు రుద్రప్రయాగ్ బయలుదేరి.. సాయంత్రం గంగా హారతి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. రాత్రికి హరిద్వార్‌లో బస చేసి.. పన్నెండో రోజు తిరుగు ప్రయాణమవుతారు. ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ యాత్ర ప్యాకేజీ ఒక్కరికి రూ.88,450 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ముగ్గురు కలిసి ఒకేసారి బుక్‌ చేసుకుంటే రూ.59,360, ఇద్దరు కలిసి చేసుకుంటే రూ.62,790కి తగ్గుతుంది. ప్యాకేజీలో ఏసీ వాహనంలో ప్రయాణం, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉంటుందని ఐఆర్‌సీటీసీ వివరించింది.