Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

విధాత : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది.
హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా..ఉత్తరకాశీ జిల్లాలోని బార్‌కోట్‌-యుమునోత్రి మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు. మరో 10 మందిని ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు రక్షించాయి.

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సమీక్షిస్తున్నారు. తాజా పరిస్థితులపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు.