• Telugu News
  • /Latest news

వరద నుంచి వరంగల్‌కు రక్షణ చర్యలు.. శాశ్వత సమగ్ర ప్రణాళికకు అడుగు

వరద ముంపు నుంచి వరంగల్ నగరాన్ని పరిరక్షించేందుకు తొలి అడుగుపడింది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని వరద ముంపు ముప్పు నుండి శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

Reported by: chinna | Latest News | Nov 06, 2025, 3:08 pm IST
Read Time: 4 mins
వరద నుంచి వరంగల్‌కు రక్షణ చర్యలు.. శాశ్వత సమగ్ర ప్రణాళికకు అడుగు

విధాత, వరంగల్ ప్రతినిధి:

వరద ముంపు నుంచి వరంగల్ నగరాన్ని పరిరక్షించేందుకు తొలి అడుగుపడింది. గ్రేటర్ వరంగల్ నగరాన్ని వరద ముంపు ముప్పు నుండి శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు. ముంపు పరిస్థితి పై సమీక్షించారు. ముఖ్యంగా డ్రైన్ డక్ట్ లు, రీటైనింగ్ వాల్స్ నిర్మాణం, నాలాలు, డ్రైన్స్ విస్తరించాలని ప్రాథమికంగా భావించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్న ఈ సమావేశంలో మున్సిపల్, రెవెన్యూ, సాగునీటి పారుదల, రెవెన్యూ, కుడా ఇతర శాఖల అధికారులతో రూపొందించాల్సిన సమగ్ర ప్రణాళికపై సమీక్షించారు.

ముంపు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ప్రధానంగా వరంగల్ నగరంలోనికి వరద నీరు ఏయే ఎగువ ప్రాంతాల నుండి వస్తుంది, ప్రస్తుతం ఉన్న నాలాలు, వాటి సామర్థ్యం, కచ్చా నాలాలు, గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఉన్న చెరువులు, ముంపు కాలనీలు, డ్రైన్ డక్టులు, ప్రస్తుతం చెరువుల పరిస్థితి, ఆక్రమణలు, నగరం నుండి వరద నీటిని సురక్షితంగా బయటకు పంపేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు, ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, డ్రైన్ డక్టుల నిర్మాణం, నాలాలు, డ్రైనేజీల విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగర భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా వరద ముంపు నుండి తప్పించేందుకు శాశ్వత సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు గుర్తుచేశారు. నిపుణుల సలహాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ వరద ముంపునుంచి శాశ్వతంగా నివారించేందుకు పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలన్నారు. వరద నీరు కాలనీల నుండి నేరుగా నగరం నుండి బయటికి వెళ్లే విధంగా ప్రణాళిక ఉండాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలో అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, మున్సిపల్, ఇరిగేషన్ ఎస్ఈ లు సత్యనారాయణ, రాంప్రసాద్,