Rainfall | గత రికార్డులను చెరిపేసిన వర్షాలు.. అక్టోబర్‌లో అత్యధికంగా 175 మి.మీ. వర్షపాతం నమోదు
Rainfall | ఈ ఏడాది వర్షాలు( Rains ) భారీగా కురిశాయి. మాన్‌సూన్( Monsoon ) ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్( October ) మాసం వరకు వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాలు( Heavy rains ), వరదలతో( Floods ) వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. నదులు ఉధృతంగా ప్రవహించాయి. కుండపోత వర్షాల కారణంగా అక్టోబర్ నెలలో అత్యధిక వర్షపాతం( Rainfall ) నమోదైంది.
Rainfall | హైదరాబాద్ : ఈ ఏడాది వర్షాలు( Rains ) భారీగా కురిశాయి. మాన్‌సూన్( Monsoon ) ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్( October ) మాసం వరకు వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాలు( Heavy rains ), వరదలతో( Floods ) వాగులు, వంకలు పొంగిపొర్లాయి.. నదులు ఉధృతంగా ప్రవహించాయి. కుండపోత వర్షాల కారణంగా అక్టోబర్ నెలలో అత్యధిక వర్షపాతం( Rainfall ) నమోదైంది.
అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో కురిసిన కుండపోత వర్షాలు.. గత రికార్డులను చెరిపేశాయి. మొంథా తుపాను( Montha Cyclone ) కారణంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో అక్టోబర్ మాసంలో అత్యధికంగా 175 మి.మీ. వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌లో సాధారణంగా 89.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ 96 శాతం అధికంగా వర్షపాతం నమోదై.. రికార్డు సృష్టించాయి వర్షాలు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో 24 గంటల్లోనే 422 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం.
ఇక జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021 అక్టోబర్ నెలలో సాధారణ వర్షపాతం(80 మి.మీ.) నమోదు కాగా, 2022లో లోటు వర్షపాతం(60 మి.మీ.) నమోదైంది. 2023లో సాధారణం కంటే 6.5 మి.మీ. వర్షపాతం అధికంగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో 75 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది అక్టోబర్ నెలలో మాత్రం 175 మి.మీ. వర్షపాతం నమోదైంది.
వరదలకు రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఆనకట్టలు తెగిపోయాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు భారీ వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి రైతులు గుండెలు బాదుకున్నారు. చేతికొచ్చిన పంట వరద పాలైందని బోరుమన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక పంట నష్టంపై జిల్లాల వారీగా వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram