IRCTC Leh Tour | లేహ్‌ అందాలను చుట్టొద్దాం రండి..! హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఎయిర్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌ఐటీసీ..!

IRCTC Leh Tour | పర్యాటకుల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచి లేహ్‌ విత్‌ తిర్తుక్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ నెల 18న పర్యటన ప్రారంభంకానున్నది. ఈ టూర్ ప్యాకేజీలో లేహ్, లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, తుర్తుక్, పాంగాంగ్‌ తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఆరు రాత్రులు, ఏడు రోజుల […]

IRCTC Leh Tour | లేహ్‌ అందాలను చుట్టొద్దాం రండి..! హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ ఎయిర్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌ఐటీసీ..!

IRCTC Leh Tour | పర్యాటకుల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచి లేహ్‌ విత్‌ తిర్తుక్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ నెల 18న పర్యటన ప్రారంభంకానున్నది. ఈ టూర్ ప్యాకేజీలో లేహ్, లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, తుర్తుక్, పాంగాంగ్‌ తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. విమానంలోనే పర్యటన కొనసాగుతుంది.

టూర్‌ కొనసాగుతుంది ఇలా..

Day-1: తొలిరోజు తెల్లవారుజామున 5.10 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల‌కు లేహ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి లేహ్‌లోనే బస ఉంటుంది.

Day-2 : రెండో రోజు ఉదయం అల్పాహారం చేసుకొని లేహ్ నుంచి షామ్ వ్యాలీకి ప్రయాణమవుతారు. శ్రీనగర్ హైవేలో సైట్ సీయింగ్ ఉంటుంది. అనంత‌రం హాల్ ఆఫ్ ఫేమ్, కాళీ మందిర్, గురుద్వార, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్‌ల‌ను సందర్శిస్తారు. రాత్రి మళ్లీ లేహ్‌లోనే బస చేస్తారు.

Day-3: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసుకొని నుబ్రా వ్యాలీ సందర్శనకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం అనంతరం దిక్షిత్, హండర్ విలేజ్‌ల‌ను సందర్శిస్తారు. సొంత ఖర్చులతో క్యామెల్ సఫారీకి వెళ్లవచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేస్తారు.

Day-4: నాలుగో రోజున తుర్తుక్ గ్రామాన్ని (1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన‌ గ్రామం) సందర్శిస్తారు. ఆ తర్వాత సియాచిన్ వార్ మెమొరియల్, థంగ్ జీరోపాయింట్ సందర్శన ఉంటుంది. అనంతరం తర్వాత బాల్టీ హెరిటేజ్ హౌజ్, మ్యూజియం, నేచురల్ కోల్డ్ స్టోరేజ్ చూస్తారు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేస్తారు.

Day-5: ఐదో రోజు నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ లేక్ సందర్శన వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Day-6: ఆరో రోజు పాంగాంగ్ లేక్‌లో సూర్యోదయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత లేహ్ తిరిగి వస్తారు. వచ్చే దారిలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్ సందర్శిస్తారు. లేహ్‌కు చేరుకున్న తర్వాత సమయం ఉంటే షాపింగ్‌కు వెళ్లవచ్చు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Day-7: ఏడో రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాల్సి ఉంటుంది. రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. దాంతో పర్యటన ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధ‌ర‌

ప్యాకేజీలో ఒక్కరు రూ.54,500 చెల్లించాల్సి ఉంటుంది. ట్విన్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.48,560, ట్రిపుల్‌ షేరింగ్‌లో రూ.47,830 చెల్లించాల్సి చెల్లించాల్సి ఉంటుంది. విమాన టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ టూర్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి.