అవినీతికి జాతీయవాదం ముసుగా?.. ఇవేనా అచ్ఛే దిన్?

విధాత‌ : అమెరికాకు చెందిన ష్టార్ట్‌సెల్ల‌ర్ సంస్థ దేశంలో అదానీ గ్రూప్ కంపెనీల అక్ర‌మాలు, మోసంతో షేర్ల ధ‌ర‌ల‌ను ఎక్కువ‌గా చూపి సొమ్ము చేసుకున్న విధానాన్ని హిండెన్‌బ‌ర్గ్ రిపోర్టు బ‌హిర్గ‌తం చేసిన త‌ర్వాత‌… అదానీ గ్రూప్ ఆదివారం ప్ర‌తిస్పందించింది. హిండెన్ బర్గ్ ఆరోప‌ణ‌ల‌కు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇస్తూనే…, అదానీ కంపెనీల డొల్ల‌వృద్ధి పేరుతో భార‌త‌దేశ అభివృద్ధిపై దాడి చేసింద‌ని షార్ట్‌సెల్ల‌ర్ సంస్థ‌పై ఎదురుదాడి చేసింది. అబ‌ద్ధాలు, వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో కూడిన హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు అన్నీ అంకెల గార‌డీ […]

అవినీతికి జాతీయవాదం ముసుగా?.. ఇవేనా అచ్ఛే దిన్?

విధాత‌ : అమెరికాకు చెందిన ష్టార్ట్‌సెల్ల‌ర్ సంస్థ దేశంలో అదానీ గ్రూప్ కంపెనీల అక్ర‌మాలు, మోసంతో షేర్ల ధ‌ర‌ల‌ను ఎక్కువ‌గా చూపి సొమ్ము చేసుకున్న విధానాన్ని హిండెన్‌బ‌ర్గ్ రిపోర్టు బ‌హిర్గ‌తం చేసిన త‌ర్వాత‌… అదానీ గ్రూప్ ఆదివారం ప్ర‌తిస్పందించింది. హిండెన్ బర్గ్ ఆరోప‌ణ‌ల‌కు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇస్తూనే…, అదానీ కంపెనీల డొల్ల‌వృద్ధి పేరుతో భార‌త‌దేశ అభివృద్ధిపై దాడి చేసింద‌ని షార్ట్‌సెల్ల‌ర్ సంస్థ‌పై ఎదురుదాడి చేసింది. అబ‌ద్ధాలు, వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో కూడిన హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు అన్నీ అంకెల గార‌డీ అని తోసిపుచ్చింది.

ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల‌కు హిండెన్బ‌ర్గ్ 88 ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. ఆ 88 ప్ర‌శ్న‌ల్లో 65 అదానీ పోర్ట్ ఫోలియో కంపెనీల‌కు సంబంధించిన‌వ‌ని, మిగిలిన 23 ప్ర‌శ్న‌ల్లో 18 ప‌బ్లిక్ వాటాదారులు, మూడ‌వ ప‌క్షానికి చెందిన వారికి సంబంధించిన‌వ‌ని అదానీ గ్రూప్ తేల్చింది. మిగిలిన ఐదు ప్ర‌శ్న‌లు పూర్తిగా ఊహాజ‌నిత‌మైవని, నిరాధార‌మైన‌వని కొట్టిపారేసింది. అంటే… హిండెన్ బ‌ర్గ్ రిపోర్టు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ అదానీ గ్రూప్‌ స‌మాధానం ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్న‌ది. భార‌త దేశ అభివృద్ధిని అడ్డుకొనే కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ షార్ట్‌సెల్ల‌ర్ కంపెనీని విమ‌ర్శిస్తూనే… త‌న కంపెనీలపై దాడిని ఏకంగా భార‌త‌దేశంపై దాడి అని ముడిపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అవినీతిని కప్పి పెట్టలేరు

హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి అదానీ గ్రూప్‌ వివ‌రణను కూడా షార్ట్‌సెల్ల‌ర్ అంతే తీవ్రంగా ఖండించింది. జాతీయ‌వాదాన్ని ముందుకు తెచ్చి మీ అవినీతిని క‌ప్పిపెట్ట‌లేర‌ని అదానీకి చుర‌క‌లంటించింది. హిండెన్ బ‌ర్గ్ రిపోర్టు వెలుగు చూసిన త‌ర్వాత‌.. దేశీయ స్టాక్ మార్కెట్ల‌న్నీ కుప్ప‌కూలాయ‌ని, ల‌క్ష‌ల కోట్ల‌లో సంప‌ద ఆవిరైంద‌నీ హిండెన్ బ‌ర్గ్ తెలిపింది.

సంక్షోభంలో ప్రభుత్వ రంగ సంస్థలు

ఈ వివాదం ఈ నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్‌రంగ ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు మున్నెన్న‌డూ లేని సంక‌టంలో, సంక్షోభంలో ప‌డిపోయాయి. కార్పొరేట్ చ‌ర్రిత‌లోనే ఇదొక పెద్ద కుంభ‌కోణంగా హిండెన్ బ‌ర్గ్ చెప్తున్న‌ది. కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరామ్ ర‌మేశ్ అయితే… భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మూల‌స్తంభాలుగా ఉన్న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌నే అదానీ గ్రూప్ మోసంతో కూల్చివేసింద‌ని ఆరోపించారు. అయితే రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల‌కు లోబ‌డి రుణాలు మంజూరు చేశామ‌ని, అప్పులు 25శాతానికి మించి లేవ‌ని బ్యాంకులు చెప్పుకొస్తున్నాయి. బ్యాంకుల‌కు ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే ప్ర‌మాద‌మేమీ లేద‌నీ, కాకుంటే జాగ్ర‌త్త‌గా అన్ని ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని బ్యాంకు అధికారులు అంటున్నారు.

అదానీపై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఓ వింత‌వాద‌న ముందుకు వ‌స్తున్న‌ది. ఒక కార్పొరేట్ కంపెనీ చేసినట్టు చెబుతున్న విమ‌ర్శ‌ల‌ను భార‌త దేశంపై విమ‌ర్శ‌లుగా అన్వయించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం విస్మయపరుస్తున్నది. అదానీపై విమ‌ర్శ‌లు చేస్తే అది మోదీపై దాడిగా చిత్రీక‌రిస్తున్నారు. వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌నుంచి త‌ప్పించుకొనేందుకు అదానీ జాతీయ‌వాదాన్ని ముందుకు తెచ్చి, దాని మాటున దాక్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, అక్ర‌మాల‌కు చివ‌రి ముసుగుగా దేశ‌భ‌క్తి ముందుకు వ‌స్తుందంటే.. ఇదేనేమో… ఇదేనా.. అచ్చేదిన్‌…!