MLC Jeevan Reddy | తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులపై పట్టింపేది?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
MLC Jeevan Reddy | సదర్మట్ బ్యారేజ్ , కడెం ప్రాజెక్టు మరమ్మత్తులపై నిర్లక్ష్యం విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఖానాపూర్, కడెం రైతుల వర ప్రధాయిని సదర్మట్ అయకట్టు రోజురోజుకు మనుగడ కోల్పోతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో జీవన్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సదర్మట్ బ్యారేజ్ పై తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపులేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రైతుల ఆయకట్టు ఆందోళనలో పడిందని ఆయన పేర్కొన్నారు. […]
MLC Jeevan Reddy |
సదర్మట్ బ్యారేజ్ , కడెం ప్రాజెక్టు మరమ్మత్తులపై నిర్లక్ష్యం
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఖానాపూర్, కడెం రైతుల వర ప్రధాయిని సదర్మట్ అయకట్టు రోజురోజుకు మనుగడ కోల్పోతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో జీవన్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సదర్మట్ బ్యారేజ్ పై తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపులేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రైతుల ఆయకట్టు ఆందోళనలో పడిందని ఆయన పేర్కొన్నారు. రజాకార్ల హాయంలో వచ్చిన సాగునీటి సౌకర్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పరిరక్షించలేక పోతుందని ఆరోపించారు.
సత్వరమే సదర్మాట్ కెనాల్ గండ్లు పూడ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో కడెం ప్రాజెక్టు అనేది వుందో లేదో అర్ధం కావడం లేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడెం ప్రాజెక్టు గత సంవత్సర భయానక పరిస్థితి నుండి బయట పడినప్పటికీ దాని నుంచి గుణపాఠం కూడా తెలంగాణ ప్రభుత్వం నేర్చుకోలేదని, మరమ్మతులు చేయక పోవడం మూలంగానే మొన్నటి విపత్తు వచ్చిందని , ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం, నాయకులు కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
కుఫ్టి ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పినప్పటికీ ఆచరణలో అమలు తీసుకురాకపోవడం మూలంగా రెండు మండలాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కడెం ప్రాజెక్టు ఎగువన కుఫ్టి ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లయితే కడెం ప్రాజెక్టుకు వరద పోటు తగ్గుతుందన్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసి అదనంగా గేట్లు నిర్మాణం చేయాలని రాబోయే సంవత్సరంలో ప్రాజెక్టుకు ప్రమాదం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు .
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram