Jackpot l ఇది క‌దా జాక్‌పాట్ అంటే.. రూ.16,407 కోట్ల లాట‌రీ గెలిచాడు…

ర‌త‌న్‌టాటా ఆస్తి కంటే 4రెట్లు ఎక్కువ‌ ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన ప్రాంతంలో ఇల్లు కొనుగోలు అక్క‌డ ఉండేవారంతా హాలీవుడ్ ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలే.. లాట‌రీ గెలిచి ల‌క్షాధికారి అయ్యారు.. కోటీశ్వ‌రులు అయ్యారు అనే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు విన్నాం. కానీ కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా బిలియ‌నీర్ అయ్యాడు. చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గెలుచుకోని విధంగా వేల కోట్లు సొంతం చేసుకున్నాడు. దీంతో హాలీవుడ్ ప్ర‌ముఖులు, ఇత‌ర సెల‌బ్రిటీలు ఉండే ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో ఇల్లు […]

Jackpot l ఇది క‌దా జాక్‌పాట్ అంటే.. రూ.16,407 కోట్ల లాట‌రీ గెలిచాడు…
  • ర‌త‌న్‌టాటా ఆస్తి కంటే 4రెట్లు ఎక్కువ‌
  • ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన ప్రాంతంలో ఇల్లు కొనుగోలు
  • అక్క‌డ ఉండేవారంతా హాలీవుడ్ ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలే..

లాట‌రీ గెలిచి ల‌క్షాధికారి అయ్యారు.. కోటీశ్వ‌రులు అయ్యారు అనే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు విన్నాం. కానీ కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా బిలియ‌నీర్ అయ్యాడు. చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గెలుచుకోని విధంగా వేల కోట్లు సొంతం చేసుకున్నాడు. దీంతో హాలీవుడ్ ప్ర‌ముఖులు, ఇత‌ర సెల‌బ్రిటీలు ఉండే ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో ఇల్లు కొన్నాడు. ఎవ‌రా వ్య‌క్తి.. ఏమిటా వివ‌రాలు తెలుసుకుందాం…

Jackpot: బ్రిటీష్ వార్తాప‌త్రిక ఇండిపెండెంట్ (Independent) నివేదిక తెలిపిన‌ ప్ర‌కారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో (Edwin Castro) లాట‌రీ (Lottery) ద్వారా వేల కోట్లు గెల్చుకున్నాడు. 2022 న‌వంబ‌ర్ నెల‌లో 2 బిలియ‌న్ డాల‌ర్లు (రూ.16,407కోట్లు) లాట‌రీ ద్వారా గెలుచుకున్న మొద‌టి వ్య‌క్తిగా రికార్డు సృష్టించాడు.

అమెరికాలోనే కాదు.. చ‌రిత్రలోనే విలువైన ప‌వ‌ర్‌బాల్ మెగా లాట‌రీని సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు మాత్ర‌మే ఒక బిలియ‌న్ డాల‌ర్లు గెలుచుకున్నారు. అయితే ఎడ్విన్ కాస్ట్రో తాజా లాట‌రీలో గెలుపొందిన మొత్తం ఎంతంటే.. ప‌న్ను ఇత‌ర కోత‌లు పోయిన త‌రువాత రూ.8180కోట్లు త‌న చేతికి వ‌చ్చాయి.

ఈ జాక్‌పాట్‌తో కాస్ట్రో జీవితం పూర్తిగా మారిపోయింది. త‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. హాలివుడ్ ప్ర‌ముఖులు, ఇత‌ర సెల‌బ్రిటీలు నివాస‌ముండే ప్రాంతంలో రూ. 200కోట్లతో ఖ‌రీదైన భ‌వ‌నాన్ని కొన్నాడు. దీంతో అరియానా గ్రాండే, డ‌కోటా జాన్స‌న్ జిమ్మీ కిమ్మెల్ త‌దిత‌ర ప్ర‌ముఖులు కాస్ట్రోకి ఇరుగు పొరుగు వార‌య్యారు.

ఈ భ‌వ‌నం ప్ర‌త్యేక‌త‌లు..

కాస్ట్రో ఖ‌రీదు చేసిన భ‌వ‌నం 13500 చ‌ద‌ర‌పు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న‌ది. అత్యంత విలాస‌వంత‌మైన, అద్భుత‌మైన అలంక‌ర‌ణ గ‌ల‌ ఐదు బెడ్రూమ్‌లు, అధునాత‌న స‌దుపాయాల‌తో ఏర్పాటుచేసిన‌ ఏడు బాత్‌రూమ్‌లు, ఇంకా ఇన్ఫినిటీ పూల్‌, రెండు ఫైర్ పిట్స్‌, అవుట్ డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, సినిమా థియేట‌ర్ ఫిట్నెస్ స్టూడియో, రూఫ్ టాప్ డెక్‌, ఫైవ్ కార్ షోరూం, రెండు కారు గ్యారేజీలు లాంటి సౌక‌ర్యాలు ఎన్నో ఆ భ‌వ‌నానికి సొంతం.

ర‌త‌న్‌టాటా ఆస్తి కంటే 4 రెట్లు ఎక్కువ‌

లాట‌రీ ద్వ‌రా కాస్ట్రో గెలుచుకున్న‌మొత్తం భార‌త‌దేశంలోని అత్యంత ప్ర‌సిద్ధ పారిశ్రామిక‌వేత్త‌ల‌లో ఒక‌రైన ర‌త‌న్‌టాటా వ్య‌క్తి గ‌త ఆస్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ‌ని ఇండిపెండెంట్ నివేదిక‌ తెలిపింది. ర‌త‌న్‌టాటా ఆస్తి విలువ‌ దాదాపు 4వేల కోట్ల రూపాయ‌ల‌ని పేర్కొంది.