Isha Ambani | పండంటి కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ..
Isha Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. నవంబర్ 19న ఒక పాప, ఒక బాబుకు ఇషా జన్మనిచ్చినట్లు అంబానీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇషా అంబానీ, ఆనంద్ పిరమిల్‌కు 2018లో వివాహమైన సంగతి తెలిసిందే. ఇషా అంబానీకి కవలలు జన్మించినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇషా, ఆనంద్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయం మీతో […]

Isha Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. నవంబర్ 19న ఒక పాప, ఒక బాబుకు ఇషా జన్మనిచ్చినట్లు అంబానీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇషా అంబానీ, ఆనంద్ పిరమిల్‌కు 2018లో వివాహమైన సంగతి తెలిసిందే.
ఇషా అంబానీకి కవలలు జన్మించినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇషా, ఆనంద్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. నవంబర్ 19వ తేదీన ఇషాకు పాప, బాబు పుట్టారు. వారి పేర్లు అదియా, కృష్ణగా నామకరణం చేశారు. తల్లీపిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు. అదియా, కృష్ణతో పాటు ఇషా, ఆనంద్‌కు మీ ఆశీర్వాదం, శుభాకాంక్షలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
నీతా అంబానీకి కూడా కవలలే..
ముఖేశ్ అంబానీ, నీతాకు ముగ్గురు సంతానం. ఆకాశ్, ఇషా(31) కవల పిల్లలు. అనంత్(27) ఉన్నారు. అయితే ఆకాశ్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలైన శ్లోకాను 2020లో వివాహం చేసుకున్నాడు. వారికి 2020, డిసెంబర్‌లో కుమారుడు జన్మించాడు. అకాశ్ కుమారుడి పేరు పృథ్వీ ఆకాశ్ అంబానీ. ఇక అనంత్ అంబానీ కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరెన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ను వివాహం చేసుకుంటారని ప్రచారంలో ఉంది. ఇక అంబానీ ముగ్గురు పిల్లలు కూడా రిలయన్స్ వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.