Israeli | తెగిన తలను.. మళ్లీ అతికించారు!
Israeli ఇజ్రాయెల్ వైద్యుల క్లిష్టమైన సర్జరీ జెరూసలేం: తల తెగిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా ఉంటుందా? ప్రాణం పోయినట్టే! కానీ.. ఇజ్రాయెల్ వైద్యులు మాత్రం అద్భుతమైన, క్లిష్టమైన సర్జరీ చేసి.. తెగిపోయిన తలను మళ్లీ మెడకు అతికించి.. కొత్త ప్రాణం పోశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌కు చెందిన సులేమాన్ హసన్ అనే 12 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కతూ వెళుతుండగా.. ఒక కారు వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ బాలుడి మెడ […]

Israeli
- ఇజ్రాయెల్ వైద్యుల క్లిష్టమైన సర్జరీ
జెరూసలేం: తల తెగిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా ఉంటుందా? ప్రాణం పోయినట్టే! కానీ.. ఇజ్రాయెల్ వైద్యులు మాత్రం అద్భుతమైన, క్లిష్టమైన సర్జరీ చేసి.. తెగిపోయిన తలను మళ్లీ మెడకు అతికించి.. కొత్త ప్రాణం పోశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌కు చెందిన సులేమాన్ హసన్ అనే 12 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కతూ వెళుతుండగా.. ఒక కారు వచ్చి అతడిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆ బాలుడి మెడ వెన్నెముక భాగంలో విడిపోయింది. దీంతో వెంటనే ఆ బాలుడిని హదస్సా మెడికల్ సెంటర్‌కు విమానంలో తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడి పుర్రె కింది భాగం బాగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. దీనిని వైద్య పరిభాషలో బైలేట్రల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్ అని పిలుస్తారు.
ఇది చాలా అరుదైన గాయం. ప్రత్యేకించి చిన్నపిల్లలో మరీ అరుదు. ‘ఆ బాలుడికి ప్రాణం పోయడం కోసం మేం యుద్ధమే చేశాం’ అని ఈ అరుదైన శస్త్రచికిత్సలో పాల్గొన్న బృందంలోని వైద్యుడు డాక్టర్ ఒహద్ ఐనవ్ చెప్పారు. ‘ఈ ప్రక్రియే అత్యంత క్లిష్టమైనది. అనేక గంటలు పట్టింది.
బాగా దెబ్బతిన్న ప్రాంతంలో కొత్త ప్లేట్లు, ఫిక్సేషన్స్ వాడాం. ఆపరేషన్ గదిలో ఉన్న అధునాతన సాంకేతిక పరికరాలు, మాకున్న అవగాహనతో ఆ బాలుడి ప్రాణాలు కాపాడగలిగాం’ అని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదంలో హసన్‌కు నరాలు, సెన్సరీ లేదా మోటర్ డిస్‌ఫంక్షన్ లేకపోవడం కూడా అదృష్టమని అన్నారు.
వెన్నెముక గాయాలకు ట్రామా సర్జరీ చేయడంలో ప్రత్యేకత కలిగిన అతికొద్ది మంది ఇజ్రాయెల్ డాక్టర్లలో ఆర్థోపెడిక్ సర్జన్లలో ఐనవ్ ఒకరు. సాధారణంగా ఇటువంటి గాయాలకు గురైనవారిలో శస్త్రచికిత్స సఫలత రేటు 50శాతం మాత్రమే. కానీ.. హసన్ మాత్రం అనూహ్యంగా కోలుకున్నాడు. ప్రస్తుతం మెడ చుట్టూ పట్టీ వేసుకుని ఉన్నాడు. అతడిని వైద్య బృందం నిత్యం పర్యవేక్షిస్తున్నది.