TSPSC: ఆ ఐదు పరీక్షల తేదీలపై నేడో, రేపో రానున్నస్పష్టత

విధాత‌: ప్రశ్రపత్రాల లీకేజీతో రద్దై, వాయిదా పడిన ఐదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ (TSPSC) కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటీఫికేషన్ల పరీక్షలను రద్దు, రెండింటిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE), అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (AE), పరీక్షలు రద్దయ్యాయి. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సిస్‌ ( TPBO), వెటర్నరీ అసిస్టెంట్‌ (VETERINARY ASSISTANT) […]

TSPSC: ఆ ఐదు పరీక్షల తేదీలపై నేడో, రేపో రానున్నస్పష్టత

విధాత‌: ప్రశ్రపత్రాల లీకేజీతో రద్దై, వాయిదా పడిన ఐదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ (TSPSC) కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటీఫికేషన్ల పరీక్షలను రద్దు, రెండింటిని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

వీటిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE), అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (AE), పరీక్షలు రద్దయ్యాయి. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సిస్‌ ( TPBO), వెటర్నరీ అసిస్టెంట్‌ (VETERINARY ASSISTANT) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందులో గ్రూప్‌-1 పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ప్రకటించింది. జూన్‌ 11న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించనున్నది. ఇప్పటికే రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి సర్వీస్‌ కమిషన్‌ నేడు లేదా రేపు కొత్త తేదీలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సర్వీస్‌ కమిషన్‌ వీటిలో కొన్ని పోస్టుల రాత పరీక్షలను గతంలో ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించింది. తాజాగా వీటికి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాల‌ని భావిస్తున్నది. ఏయే పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తారు? ఏయే పరీక్షలు ఓఎంఆర్‌ పద్ధతిలో ఉంటాయన్న అంశాలతో పాటు కొత్త తేదీలను ప్రకటించనున్నట్టు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. అలాగే హార్టికల్చర్‌ పరీక్ష యథాతథంగా జరుగుతుందా? రీషెడ్యూలా? అన్నది కూడా స్పష్టత రానున్నది.