Jailer | ర‌జ‌నీకాంత్‌కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత‌.. భ‌లే స‌ర్‌ప్రైజ్ చేశాడుగా..!

Jailer | సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్ సినిమాల కోసం ప్రేక్ష‌కులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ర‌జ‌నీకాంత్ గ‌త కొన్నేళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడు. ఆ స‌మ‌యంలో జైలర్ చిత్రం ర‌జ‌నీకాంత్‌కి మంచి విజ‌యం అందించింది. గత కొన్నేళ్లుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. ఈ క్ర‌మంలో బీస్ట్ సినిమా దర్శకుడు […]

  • By: sn    latest    Sep 01, 2023 3:45 PM IST
Jailer | ర‌జ‌నీకాంత్‌కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత‌.. భ‌లే స‌ర్‌ప్రైజ్ చేశాడుగా..!

Jailer |

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్ సినిమాల కోసం ప్రేక్ష‌కులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ర‌జ‌నీకాంత్ గ‌త కొన్నేళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడు. ఆ స‌మ‌యంలో జైలర్ చిత్రం ర‌జ‌నీకాంత్‌కి మంచి విజ‌యం అందించింది.

గత కొన్నేళ్లుగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. ఈ క్ర‌మంలో బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మంచి స‌క్సెస్ అందించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఆగస్టు 10న విడుదలై అదరగొడుతోంది. జైల‌ర్ సినిమా రూ.600 కోట్ల క్లబ్‌లో చేరడంతో ర‌జ‌నీ అభిమానులతో పాటు నిర్మాత‌లు ఫుల్ ఖుష్ అయ్యారు.

జైల‌ర్ సినిమాతో భారీ సక్సెస్‌ను ఊహించిన కళానిధి మారన్.. లాభాలు భారీగా ఆర్జించ‌డంతో ఇప్పుడు ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. ఇక జైల‌ర్ విజయానికి కారణమైన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌, రజనీకాంత్‌‌లకు కానుకల మీద కానుకలు ఇస్తున్నారు.

ఇప్పటికే రజనీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్ ఇచ్చిన నిర్మాత.. తాజాగా ఒక లగ్జరీ కారును బహుమతిగా అందజేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రూ.122.5 కోట్లు థియేట్రికల్ రైట్స్ ద్వారా రాబ‌ట్టిన ఈ సినిమా విడుదలైన తరవాత రూ.240 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే చాల‌ని అనుకున్నారు.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రూ.600 కోట్ల గ్రాస్ రాబట్టేసి నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూట ర్లకు కూడా కాసుల పంట పండింది. రజనీకాంత్‌కు లాభాల్లో వాటాతో పాటు ఒక ఖరీదైన లగ్జరీ కారును కూడా గిఫ్ట్ ఇచ్చారు నిర్మాత సన్ పిర్చర్స్‌ కళానిధి మారన్. అదే సమయంలో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ను కార్ల షోరూంకు తీసుకెల్లి లగ్జరీ కారును బహుమతిగా అందజేశారు.

సాధారణంగా సినిమా ద్వారా నిర్మాతకు భారీ స్థాయిలో లాభాలు వచ్చినప్పుడు హీరోకి గానీ, దర్శకుడికి గానీ ఖరీదైన కార్లు బ‌హుమ‌తులుగా ఇవ్వ‌డం ఒక ఆచారంగా మారింది. ఈ క్ర‌మంలో క‌ళానిధి మారన్ కోట్ల రూపాయలు విలువ చేసే రెండు లగ్జరీ కార్లను రజనీకాంత్ ఇంటికి తీసుకువెళ్లి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఏది కావాలో ఎంపిక చేసుకోమని ఆశ్చర్యపర‌చ‌గా, రెండు కార్లను పరిశీలించిన తలైవా.. వాటిలో ఒక కారును తీసుకున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.