Jaya Bachchan | రాజ్యసభలో చేతులు జోడించి క్షమాపణలు కోరిన ఎంపీ జయాబచ్చన్
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వారం రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై జయాబచ్చన్ ఆవేశపూరితంగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

Jaya Bachchan | న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వారం రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌పై జయాబచ్చన్ ఆవేశపూరితంగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన పదవీకాలం ముగియనుండటంతో ఆమె చివరిసారిగా శుక్రవారం సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా జయాబచ్చన్ చేతులు జోడించి క్షమాపణలు కోరారు. తాను ఎవర్నీ హార్ట్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. అది నా షార్ట్ టెంపర్ అని పేర్కొన్నారు. ఉన్నట్టుండి ఎందుకు కోపం వస్తుందని చాలా మంది తనను తరుచూ అడుగుతుంటారు.. కానీ అది తన స్వభావం అని, దాన్ని మార్చుకోలేనని, ఏదైనా విషయాన్ని అంగీకరించలేని సమయంలో తాను తన సహనాన్ని కోల్పోనున్నట్లు ఆమె చెప్పారు. మీతో నేనెప్పుడైనా అసంబద్ధంగా వ్యవహరిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు జయాబచ్చన్ పేర్కొన్నారు. జయాబచ్చన్ చేతులు జోడించి క్షమాపణలు కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.