Vice President Jagdip Dhankhad | ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్ రాజీనామా ఆమోదం

Vice President Jagdip Dhankhad | ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్ రాజీనామా ఆమోదం

విధాత: ఉప రాష్ట్రపతి జగ్డీప్‌ ధన్ ఖడ్ రాజీనామా (Resignation)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ఆమోదించారు(Accepted). ధన్ ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము ఆ సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది. తదుపరి ఉప రాష్ట్రపతి రేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ పేరు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజీనామా ఆమోదం పిదప ప్రధాని మోదీ స్పందిస్తూ ధన్ ఖడ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

పదవి కాలం ముగియ్యకముందే ధన్ ఖడ్ రాజీనామా చేయడం వెనుక కారణాలతో రాజకీయ పార్టీల ఆసక్తి నెలకొంది. ఆయన అనారోగ్య కారణాలంటూ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతుంది. బీజేపీలో నెలకొన్న విభేదాలతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు.