Heart Stroke | నిద్ర కొర‌వ‌డితే.. యువ గుండెకు య‌మగండం..

Heart Stroke | ఒక మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర( Sleep ) చాలా ముఖ్యం. నిద్ర స‌రిగ్గా లేక‌పోతే ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు( Health Issues ) గుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ముఖ్యంగా గుండెపోటు( Heart Stroke )కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. నిద్ర కొర‌వ‌డితే యువ గుండెకు య‌మ‌గండం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

  • By: raj |    health-news |    Published on : Nov 07, 2025 8:27 AM IST
Heart Stroke | నిద్ర కొర‌వ‌డితే.. యువ గుండెకు య‌మగండం..

Heart Stroke | గుండె( Heart ) ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే జీవ‌న‌శైలి( Life Style ), ఆహార‌పు అల‌వాట్లు( Food Habits ) స‌క్ర‌మంగా, ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు క్ర‌మం త‌ప్పుతాయో.. అప్పుడు వాటి ప్ర‌భావం శ‌రీరం మీద ప‌డి ఆరోగ్య వ్య‌వ‌స్థ గాడి త‌ప్పుతుంది. అయితే ప్ర‌స్తుత జీవ‌న‌శైలిలో ముఖ్యంగా వేళ‌కు తిండి, నిద్ర( Sleep ) క‌రువ‌య్యాయి. శారీర‌క శ్ర‌మ త‌గ్గి, మాన‌సిక ఒత్తిడి పెరిగింది. దీంతో నిద్ర‌కు దూర‌మ‌వుతున్నారు. గుండె జ‌బ్బుల‌కు( Heart Diseases ) నిద్ర కూడా ఒక కార‌ణ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

నిద్ర ఎంతో అవ‌స‌రం..

ప్ర‌తి మ‌నిషి బ‌య‌లాజిక‌ల్ క్లాక్‌కి అనుగుణంగా న‌డుచుకోవాలి. అంటే నిద్ర వేళ‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి. నిద్ర పోవాల్సిన స‌మ‌యంలో మేల్కొని, మేల్కొని ఉండాల్సిన స‌మ‌యంలో నిద్రించ‌డం వ‌ల్ల బ‌య‌లాజిక‌ల్ క్లాక్ అస్థ‌వ్య‌స్త‌మ‌వుతుంది. కొంత మంది రాత్రి వేళ నిద్రించ‌డం కుద‌ర‌న‌ప్పుడు.. దాన్ని ప‌గ‌టిపూట భ‌ర్తీ చేద్దామ‌ని అనుకుంటాం. కానీ ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. ప్ర‌తి వ్య‌క్తి రోజుకు క‌నీసం 7 నుంచి 8 గంట‌ల పాటు నిద్రించాలి. నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీరం సేద తీర‌డంతో పాటు, త‌న‌కు తాను మ‌రుస‌టి రోజుకు కావాల్సిన శ‌క్తిని స‌మ‌కూర్చుకుంటారు. ఎప్పుడైతే ఈ ప‌నిలో లోపాలు ఏర్పడుతాయో అప్పుడు ఆరోగ్య వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప‌రిస్థితే ఎక్కువ కాలం పాటు కొన‌సాగితే ర‌క్త‌పోటుకు గుర‌వ‌క త‌ప్పుదు. ఈ ర‌క్త‌పోటే క్ర‌మేపీ గుండెను దెబ్బ‌తీసి హృద్రోగాల‌ను క‌ల‌గ‌జేస్తుంది.

గుండె స‌మ‌స్య‌ను గుర్తించేదిలా..?

  • తేలిక‌గా అల‌సిపోవ‌డం.
  • బ‌రువు ప‌నులు చేసినా, మెట్లు ఎక్కుతున్నా, ప‌రుగెత్తుతున్నా, వ్యాయామం చేస్తున్నా తేలిక‌గా అల‌స‌ట రావ‌డం.
  • గుండె వేగంగా కొట్టుకోవ‌డం.
  • ప‌ని చేస్తున్న‌ప్పుడు వాంతి వ‌చ్చిన‌ట్టు అనిపించ‌డం, విప‌రీతంగా చెమ‌ట‌లు ప‌ట్ట‌డం.