Bhupalpally | భూపాలపల్లిలో ఇసుక లారీ బీభత్సం.. 10 బైక్‌లు, కారు ధ్వంసం

Bhupalpally తప్పిన పెద్ద ప్రమాదం 10 బైక్‌లు, కారు ధ్వంసం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఇసుక లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో అక్కడ ఉన్న వాహనాలపైకి ఇసుక లారీ వేగంగా దూసుకెళ్ళింది. ఈ సంఘటనలో పది బైక్ లు, ఒక కారు ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఇసుక లారీకి బైక్ మద్య ఇరుక్కున్న రంజిత్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సింగరేణి రెస్క్యూ టీం […]

  • By: Somu    latest    Aug 07, 2023 12:37 AM IST
Bhupalpally | భూపాలపల్లిలో ఇసుక లారీ బీభత్సం.. 10 బైక్‌లు, కారు ధ్వంసం

Bhupalpally

  • తప్పిన పెద్ద ప్రమాదం
  • 10 బైక్‌లు, కారు ధ్వంసం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఇసుక లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో అక్కడ ఉన్న వాహనాలపైకి ఇసుక లారీ వేగంగా దూసుకెళ్ళింది. ఈ సంఘటనలో పది బైక్ లు, ఒక కారు ధ్వంసమైంది.

ఈ సంఘటనలో ఇసుక లారీకి బైక్ మద్య ఇరుక్కున్న రంజిత్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో రంజిత్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.