JEE Main | జేఈఈ మెయిన్ ఫ‌లితాలు విడుద‌ల‌.. హైద‌రాబాదీకి మొద‌టి ర్యాంకు

JEE MAIN | జేఈఈ మెయిన్ ఫ‌లితాలు విడుద‌ల‌.. హైద‌రాబాదీకి మొద‌టి ర్యాంకుదేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన జేఈఈ మెయిన్ -2023 సెష‌న్ -2 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. జేఈఈ ఫ‌లితాల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు స‌త్తా చాటారు. హైద‌రాబాద్‌కు చెందిన విద్యార్థి సింగార‌పు వెంక‌ట్ కౌండిన్య ఆల్ ఇండియాలో మొద‌టి ర్యాంకు సాధించాడు. కౌండిన్య 300 300 స్కోర్ చేశాడు. జూన్ 4వ తేదీన జ‌రిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో […]

JEE Main | జేఈఈ మెయిన్ ఫ‌లితాలు విడుద‌ల‌.. హైద‌రాబాదీకి మొద‌టి ర్యాంకు

JEE MAIN |

జేఈఈ మెయిన్ ఫ‌లితాలు విడుద‌ల‌.. హైద‌రాబాదీకి మొద‌టి ర్యాంకుదేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ‌ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన జేఈఈ మెయిన్ -2023 సెష‌న్ -2 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. జేఈఈ ఫ‌లితాల్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు స‌త్తా చాటారు.

హైద‌రాబాద్‌కు చెందిన విద్యార్థి సింగార‌పు వెంక‌ట్ కౌండిన్య ఆల్ ఇండియాలో మొద‌టి ర్యాంకు సాధించాడు. కౌండిన్య 300 300 స్కోర్ చేశాడు. జూన్ 4వ తేదీన జ‌రిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్త‌మ ర్యాంకు సాధించి, ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతాన‌ని కౌండిన్య పేర్కొన్నాడు.

ఇక నెల్లూరుకు చెందిన పి లోహిత్ ఆదిత్య సాయి 2వ ర్యాంక్, సాయిదుర్గారెడ్డి(హైద‌రాబాద్) 6వ ర్యాంక్, కే సాయినాథ్ శ్రీమంత‌(అమ‌లాపురం) 10వ ర్యాంకు సాధించారు. మొత్తంగా జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌ల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యుత్త‌మ ర్యాంకులు సాధించారు.

ఈ నెల 30వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మెయిన్‌లో క‌నీస క‌టాఫ్ మార్కులు నిర్ణ‌యించి మొత్తం 2.50 ల‌క్ష‌ల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హ‌త క‌ల్పించ‌నున్నారు. అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ మే 7. జూన్ 4న ప‌రీక్ష నిర్వ‌హించి, జూన్ 18న ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు.