Shibu Soren | జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్‌కు తీవ్ర అస్వస్థత
Shibu Soren | న్యూఢిల్లీ : జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. శిబూ సోరెన్ వెంట ఆయన కుమారుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో శిబూ సోరెన్ శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మళ్లీ నిన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. శిబూ సోరెన్ […]

Shibu Soren |
న్యూఢిల్లీ : జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు.
శిబూ సోరెన్ వెంట ఆయన కుమారుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో శిబూ సోరెన్ శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మళ్లీ నిన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు.
శిబూ సోరెన్ 2005 నుంచి 2010 వరకు మూడు సార్లు సీఎంగా పని చేశారు. ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 2004, అక్టోబర్ నుంచి 2005, మార్చి వరకు కేంద్ర మంత్రిగా కొనసాగారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో శిబూ సోరెన్ కీలకపాత్ర పోషించారు.