మునుగోడు: కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
విధాత: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు, ఇబ్రహీంపట్నం నుంచి పెద్ద సంఖ్యలో యువత కాంగ్రెస్‌లోకి భారీగా చేరారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నుంచి 300 మంది కాంగ్రెస్‌లో చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే పైరవీకారులన్న ముద్ర పడిందని ఆవేదన […]

విధాత: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు, ఇబ్రహీంపట్నం నుంచి పెద్ద సంఖ్యలో యువత కాంగ్రెస్‌లోకి భారీగా చేరారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నుంచి 300 మంది కాంగ్రెస్‌లో చేరారు. వారికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. ఒకప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలకు ఎంతో గౌరవం ఉండేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే పైరవీకారులన్న ముద్ర పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని, ఎన్నికల కోసం రోజుకో పంచాయితీ తీసుకొస్తున్నాయని, రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.