Indiramma sarees design| ఏ డిజైన్ బాగుందో.. ఇందిరమ్మ చీరలపై సీతక్క ఫోకస్ !

అమ్మలక్కలకు బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీపై ప్రభుత్వం ముందస్తుగా ఫోకస్ పెట్టింది. సెర్ఫ్ సీఈవో ఐఏఎస్ దివ్య దేవరాజన్ తో కలిసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయనున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల డిజైన్లను మంత్రి సీతక్క పరిశీలించారు.

Indiramma sarees design| ఏ డిజైన్ బాగుందో.. ఇందిరమ్మ చీరలపై సీతక్క ఫోకస్ !

విధాత, హైదరాబాద్ : అమ్మలక్కలకు బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీపై ప్రభుత్వం ముందస్తుగా ఫోకస్ పెట్టింది. రానున్న బతుకమ్మ పండుగకు అందించాల్సిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల డిజైన్ల ఎంపికపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులు, సహచర మంత్రులతో కసరత్తు చేస్తున్నారు. తాజాగా సెర్ఫ్ సీఈవో ఐఏఎస్ దివ్య దేవరాజన్ తో కలిసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయనున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల డిజైన్లను మంత్రి సీతక్క పరిశీలించారు.

18 ఏళ్లు పైబడిన మహిళలందరికి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరలను పంపిణీ చేస్తుంది. నవంబర్ 2025లో ప్రారంభమైన ఈ పథకం కింద, రెండు విడతల్లో సుమారు 1 కోటి చీరలను పంపిణీ చేశారు. సిరిసిల్ల, కరీంనగర్ నేతన్నలు తయారు చేసిన చీరలను మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరల నాణ్యతపై విమర్శలు వచ్చినప్పటికి పలు రకాల డిజైన్లతో కూడిన చీరలను అందించారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో పంపిణీ చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు ఒకే డిజైన్ తో ఉండటంతో యూనిఫామ్ మాదిరిగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ధఫా పంపిణీ చేసే చీరలలో పలు డిజైన్లు ఉండేలా చూసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు మహిళల నుంచి వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు, ఆర్థిక ఎదుగుదలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు అందిస్తుంది. ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేలా నాణ్యమైన, మంచి డిజైన్లతో రూపొందించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.