Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు.. పాకిస్తాన్‌లో రాచ మ‌ర్యాద‌లు! ఆరుగురు గన్ మెన్స్

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు.. పాకిస్తాన్‌లో రాచ మ‌ర్యాద‌లు! ఆరుగురు గన్ మెన్స్

Jyoti Malhotra: పాకిస్తాన్ ఎజెంట్ గా మారి..దేశ ద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ అధికారులకు ఉన్న బంధంపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతున్న కొద్ధి సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ వెళ్లినప్పుడు ఆ దేశ అధికారులు ఆమెకు రాచ మర్యాదలు చేశారు. పాక్ ప్రభుత్వం ఆమెకు ఏకంగా ఆరుగురు గన్ మెన్స్ తో కూడిన సెక్యూరిటీ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది.

ఏకే 47 రైఫిల్స్ తో కూడిన గన్ మెన్స్ జ్యోతి మల్హోత్రాకు భద్రత గా వ్యవహరించిన దృశ్యాలు స్పానిష్ యూట్యూబర్ వీడియోలో రికార్డు అయ్యాయి. జ్యోతి మల్హోత్రా అనార్కలీ మార్కెట్ లో తిరుగుతూ తీసిన వీడియోలలో ఈ దృశ్యాలు కనిపించాయి. కాగా స్పానిష్ యూ ట్యూబర్ క్యాలమ్ మిల్ కూడా జ్యోతిని పలకరించి పరిచయం చేసుకున్నాడు. ఆమెకు అంతగా సాయుధ భద్రత అవసరమా అని కూడా ఈ వీడియోలో ప్రశ్నించడం కనిపించింది.

ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా…వీసా ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడే ఆమెను పాక్ ఏజెంట్లు ట్రాప్ చేసినట్లుగా దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్ లో ఉండగానే ఐఎస్ఐతో జ్యోతి మల్హోత్రా డీల్ కుదుర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. గూఢచర్యం కేసులో పాక్ ఇంటలిజెన్స్ అధికారులతో తనకున్న సంబంధాలను జ్యోతి ఇప్పటికే అంగీకరించినట్లుగా దర్యాప్తు అధికారులు తెలిపారు.

పాక్ హైకమిషన్ లో పనిచేసే డానిష్ తో తాను నిత్యం టచ్ లో ఉండేదాన్ని అని అంగీకరించింది. 2023లో వీసా వెళ్లినప్పుడు డానిష్ పరిచయమయ్యాడని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు దేశ రహస్యాలను చేరవేసిందని అనుమానిస్తున్నారు. డానిష్ వీసా కోసం పాక్ హైకమిషన్ కు వచ్చేవారిని ట్రాప్ చేసి గూఢచర్యం కోసం వాడుకునే వాడని..అలాగే జ్యోతి మల్హొత్రాను కూడా ట్రాప్ చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్ గూఢచారిగా మారిన జ్యోతి మల్హోత్రా కేసుపై విచారణ జరిపిన హర్యానా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకుముందు నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీ విధించింది.