నేను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులే: కేఏ పాల్

KA Paul | విధాత: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ ఓటర్లను ఆకర్షించే విధంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని తానే అంటూ పోలీసులను, ఎన్నికల అధికారులను గతంలో కేఏ పాల్ బెదిరించారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికలో తాను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులు వేస్తానని చెప్పుకొచ్చారు. ఇక మునుగోడు […]

నేను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులే: కేఏ పాల్

KA Paul | విధాత: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ ఓటర్లను ఆకర్షించే విధంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని తానే అంటూ పోలీసులను, ఎన్నికల అధికారులను గతంలో కేఏ పాల్ బెదిరించారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ ఉప ఎన్నికలో తాను ఓడిపోతే.. మునుగోడుపై బాంబులు వేస్తానని చెప్పుకొచ్చారు. ఇక మునుగోడు ఉండదు. అభివృద్ధి కాదు.. అమెరికా నుంచి బాంబులు వేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రచారంలో భాగంగా ఓ లేడిస్ కార్నర్ కు వెళ్లిన కేఏ పాల్.. అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కేఏ పాల్ అభిమానులు ఆయన చేతి వేళ్లకు ఉంగరం తొడిగించారు. సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇటీవల ఓ మాస్ సాంగ్ కు కేఏ పాల్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.