Kadem Project | కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్.. డ్యాం పై నుంచి వరద
Kadem Project కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు. ప్రాజెక్టు గేట్ల పైనుండి వెళ్తున్న వరద నీరు ప్రమాదస్థాయికి చేరిన కడెం ప్రాజెక్టు . కలెక్టర్, నీటీపారుదల శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు కడెం బయలుదేరిన మంత్రి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి విధాత :- ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా […]

Kadem Project
- కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు.
- ప్రాజెక్టు గేట్ల పైనుండి వెళ్తున్న వరద నీరు
- ప్రమాదస్థాయికి చేరిన కడెం ప్రాజెక్టు .
- కలెక్టర్, నీటీపారుదల శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
- క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు కడెం బయలుదేరిన మంత్రి
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
విధాత :- ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండినవి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగ 698 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద వస్తుంది.
కడెం ప్రాజెక్టుకు ఊహించిన రీతిలో భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పుడూ ఏమవుతుందో అని ఆందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో కిందికి అదే స్థాయిలో నీటిని పంపడానికి 18 గేట్లకు గాను నాలుగు గేట్లు మొరయిస్తున్నాయి . ఇన్ ప్లో భారీగా ప్రాజెక్టు లోకి రావడంతో అవుట్ ఫ్లో అదే స్థాయిలో వెళ్లకపోవడం మూలంగా ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా మారింది.
ప్రాజెక్టుకు ఇన్ ప్లో 3. 85 లక్షల క్యూసెకుల భారీగా వరద నీరు చేరుతుంది. అవుట్ ప్లో 2.42 లక్షల క్యూసెకుల నీటిని మాత్రమే కిందికి వెళ్ళడంతో ప్రాజెక్టు పరిస్థితి డేంజర్ జోన్‌లో పడింది. 18 గేట్లు గనుక ఓపెన్ అయి ఉండి ఉంటే ఇన్ ప్లో అనుగుణంగా అవుట్ ప్లో వదిలేస్తే ఇబ్బంది ఉండకపోయేది. 4 గేట్లు మొరాయించడంతో ప్రాజెక్టు పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. జర్మన్ క్రస్ట్ గేట్లపై నుంచి వరద నీరు పారుతుంది.
ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం బయలుదేరినారు . లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గత సంవత్సరం ఇదే ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయించి ప్రమాదకర పరిస్థితి నెలకొంది .కర కట్టకు గండిపడి ప్రాజెక్టుకు ప్రమాదం తప్పింది . సంవత్సర కాలం పూర్తయినప్పటికీ అధికారులు, పాలకులు ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తులు చేయించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.