కాంతార, KGFల ప‌రువు తీస్తున్నారు

విధాత‌: కన్నడలో గత ఏడాది విడుదలైన KGF2 చిత్రం సంచ‌ల‌న విజయాన్ని సాధించింది. ఏకంగా 1000 కోట్లను రాబట్టింది. ఈ చిత్రం దేశంలో ఒక ప్రభంజనం సృష్టించింది. దేశ విదేశాలలో తన సత్తా చాటింది. 2022లో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌తో పాటు పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. ఈ కెజియఫ్ ఫ్రాంచైజీతో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. హీరో […]

  • By: krs    latest    Jan 07, 2023 2:53 AM IST
కాంతార, KGFల ప‌రువు తీస్తున్నారు

విధాత‌: కన్నడలో గత ఏడాది విడుదలైన KGF2 చిత్రం సంచ‌ల‌న విజయాన్ని సాధించింది. ఏకంగా 1000 కోట్లను రాబట్టింది. ఈ చిత్రం దేశంలో ఒక ప్రభంజనం సృష్టించింది. దేశ విదేశాలలో తన సత్తా చాటింది. 2022లో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌తో పాటు పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. ఈ కెజియఫ్ ఫ్రాంచైజీతో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. హీరో య‌ష్‌ కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతుంటే.. ప్రశాంత్ నీల్‌ కోసం బడాబడా స్టార్స్ లైన్లో ఉన్నారు.

మరోవైపు గత ఏడాది కన్నడలో వచ్చిన మరో చిత్రం ‘కాంతార’ సంచలనాలు నమోదు చేసింది. కన్నడ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా రియలిస్టిక్ ఫీల్‌తో నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కేవలం 16 కోట్లతో నిర్మితమై 400 కోట్లను వసూలు చేసింది. దాంతో చాలామంది ఈ రెండు చిత్రాలకు పోలిక పెట్టడం ప్రారంభించారు. కారణం రెండు కన్నడ చిత్రాలే కావడం. కానీ వీటి కంటే మరో పెద్ద కారణముంది. అదేమిటంటే KGF చాప్టర్2, కాంతార చిత్రాల గురించి కొందరు కన్నడ నటులు చేస్తున్న వ్యాఖ్యలు.

కాంతార చిత్రాన్ని ఇప్పటివరకు చూడలేదని, తనకు సమయం దొరకలేదని కన్నడ కస్తూరి రష్మిక మందన్నా వ్యాఖ్యానించడంతో కన్నడిగులు ఆమెపై మండిపడ్డారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాస్త ఆలస్యంగా సినిమా చూశానని సినిమా మేకర్స్‌కు మెసేజ్ కూడా పెట్టానని ఆమె వివరణ ఇచ్చినా… ఇప్పటికీ నెటిజన్ల నుండి రష్మికపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. కాగా KGF చాప్టర్ 2 గురించి కాంతార నటుడు కిషోర్ చేసిన సంచలన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి.

కాంతార చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన కిషోర్ తాజాగా మాట్లాడుతూ.. నేను ఇంతవరకు KGF2 చూడలేదు. అది నా వ్యక్తిగత చాయిస్. సినిమాపైన నా అభిప్రాయం వేరుగా ఉంటుంది. తీవ్రమైన సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు అంటే నాకు ఇష్టం.. మైండ్ లెస్ ఎంటర్‌టైన్స్ నాకు నచ్చవు. త‌ప్పో ఒప్పో తెలియదు కానీ ఇప్పటివరకు నేను KGF2 చూడలేదు. ఇది నా అభిరుచికి తగ్గ చిత్రం కాదు. భారీ మైండ్లెస్ మూవీల కంటే తీవ్రమైన కంటెంట్ కలిగి విజయం సాధించకపోయినా సరే చిన్న సినిమాలనే చూడాలనుకుంటాను అని వ్యాఖ్యలు చేశాడు.

దీంతో రాబోయే కాలంలో కిషోర్ పై నెటిజన్స్ ఏ స్థాయిలో విరుచుకుపడతారో వేచి చూడాలి. మొత్తానికి మరో వివాదానికి రంగం అయితే సిద్ధమైంది. వాస్తవానికి చూసుకుంటే KGF చాప్టర్ 2 కూడా కమర్షియల్ సినిమానే అయినా రియ‌లిస్టిక్ మూవీగానే రూపొందింది. KGFచాప్టర్ 2, కాంతార రెండు చిత్రాలు కూడా అద్భుతమైన చిత్రాలు. వాటికి పోలిక పెట్ట‌డం స‌రికాదు. కానీ ఇలాంటి అనవసర వ్యాఖ్యలతో కన్నడ చిత్రాలపై త‌మ‌ను తామే కామెంట్ చేసుకుంటూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.