Tea With Milk | ప్రపంచంలో ఎక్కడా ఉండ‌దు.. భార‌తీయులు మాత్ర‌మే టీలో పాలు ఎందుకు క‌లుపుతారో తెలుసా..?

భాతీయుల‌కు (Indians) టీ (Tea) అంటే ఎమోష‌నల్ ఫీలింగ్. ఉద‌యం లేవ‌గానే వేడివేడి టీ తాగాల్సిందే. మ‌నం టీలో పాల‌ను క‌లుపుకుంటాం (Tea With Milk). కానీ ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో టీలో పాలు క‌ల‌ప‌రు (world skipped the milk in tea). వారు మ‌రిగించిన టీ ఆకుల‌ను తాగేందుకే ఇష్ట‌ప‌డ‌తారు.

Tea With Milk | ప్రపంచంలో ఎక్కడా ఉండ‌దు.. భార‌తీయులు మాత్ర‌మే టీలో పాలు ఎందుకు క‌లుపుతారో తెలుసా..?

Tea With Milk | చాయ్‌.. పేరు విన‌గానే తాగాల‌నిపిస్తుంది క‌దూ. టీ ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. భాతీయుల‌కు టీ అంటే ఎమోష‌నల్ ఫీలింగ్. ఉద‌యం లేవ‌గానే వేడివేడి టీ తాగాల్సిందే. అప్పుడే మైండ్ రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే, టీని ఒక్కొక్క‌రు ఒక్కోలా తయారు చేస్తారు. కొంద‌రు అల్లం చాయ్‌, మసాలా చాయ్‌ ఇలా.. ఎవ‌రికి ఇష్ట‌మైన ప‌ద్ధ‌తిలో వాళ్లు టీని చేసుకుని ఆస్వాదిస్తారు.

టీ ఘుమ‌ఘుమ‌లు..

రైల్వే స్టేష‌న్లు మొద‌లు రోడ్డు పక్క‌న టీ కొట్టు వ‌ర‌కూ టీ ఘుమ‌ఘుమ‌లు రావాల్సిందే. చిక్క‌టి పాల‌తో మంచి టీ (Tea With Milk)ని త‌యారు చేసుకొని భార‌తీయులు దాన్ని మ‌న‌సారా ఆస్వాదిస్తారు. అయితే, విదేశీయులు మాత్రం టీని తాగుతారు అంతే. వాటిలో ఎలాంటి ఇత‌ర ఇంగ్రీడియంట్స్ క‌ల‌ప‌రు. ముఖ్యంగా పాలు అస్స‌లు మిక్స్ చేసుకోరు. దానికి బ‌దులు నిమ్మ‌ర‌సం జోడించి టీని తాగుతారు. భార‌త్‌లో త‌యారు చేసే టీకి విదేశీయులు తాగే టీకి చాలా వ్య‌త్యాసం ఉంటుంది. భారత్‌లో టీ తయారీలో ఈ తేడా ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

భార‌తీయుల‌కు టీని ప్రోత్స‌హించింది బ్రిటిష్ సంస్థ‌లే..

మొద‌ట్లో టీ అంటేనే భార‌తీయుల‌కు (Indians) తెలియ‌దు. చైనాకు ఉన్న గుత్తాధిప‌త్యాన్ని స‌వాల్ చేసేందుకు 19వ శ‌తాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున టీ సాగును భార‌త్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. మొదట్లో భారతీయుల కోసం టీ సాగు చేయలేదు. ఎగుమతి కోసం, బ్రిటిష్ ఉన్నత వర్గాల కోసం పండించారు. ఆ త‌ర్వాత 1900 ప్రారంభంలో బ్రిటిష్ సంస్థ‌లు స్థానికంగా టీని ప్రోత్స‌హించ‌డం ప్రారంభించాయి.

స‌రికొత్త‌గా ఆవ‌ష్క‌రించిన భార‌త్‌..

అంతేకాదు, దాన్ని మ‌రింత రుచిక‌రంగా మార్చేందుకు పాలు, చ‌క్కెర‌, యాలకులు వంటివి యాడ్ చేసుకోవాల‌ని సూచించాయి. ఈ ఐడియా వ‌ర్కవుట్ అయ్యింది. అలా కాల‌క్ర‌మేణా ఆ టీ మ‌న‌కు కూడా అల‌వాటైపోయింది. ఇప్పుడు దాన్ని మ‌న జీవితంలో భాగం చేసుకున్నాం. కానీ, భారతీయులు బ్రిటిష్ వారు టీ తాగే విధానాన్ని ఫాలో అవ్వలేదు. దాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. మ‌సాలా చాయ్‌, అల్లం చాయ్ వంటి ఫ్లేవ‌ర్స్‌తో టీ చేయ‌డం ప్రారంభించారు. అలా అతి తక్కువ కాలంలోనే లక్షలాది మందికి టీ లేనిదే రోజు గడవని పరిస్థితి వచ్చింది.

పాలు మ‌స్ట్‌..

పాలు ప్రత్యేకం భార‌త్‌లోని ప్ర‌తి కిచెన్‌లో ఉండాల్సిందే. చాలా రకాల డ్రింక్స్‌, స్వీట్స్‌ తయారీలో పాలు మెయిన్‌ ఇంగ్రీడియంట్‌. టీతో కూడా పాలకు ఇలాంటి రిలేషన్‌ బిల్డ్‌ అయింది. పాలల్లో ఉండే చిక్క‌ద‌నం, సహజమైన తీపి టీని క్రీమీగా రుచిక‌రంగా చేస్తాయి. వీటికి తోడు యాలకులు, అల్లం వంటివి కలిస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. చక్కెర కలిపినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతుంది. దీంతో టీ ఓ డ్రింక్‌ కంటే మంచి ఫీలింగ్‌గా మారింది. మైండ్ రిఫ్రెష్‌మెంట్ కోసం ప్ర‌తి ఒక్క‌రూ రోజుకు ఒక్క‌సారైనా టీ తాగ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

విదేశీయులు ఎందుకు పాలు క‌ల‌ప‌రంటే..

విదేశాల్లో టీ త‌యారీ చాలా వేరు ఉంటుంది. టీ మొద‌ట చైనా, జ‌పాన్ వంటి దేశాల్లో పుట్టింది. అందుకే వారు టీ స్వ‌చ్ఛ‌త‌కు ఎక్కువ‌గా ప్రియారిటీ ఇచ్చేవారు. వారి దృష్టంతా టీ ఆకు, సువాస‌న‌పైనే ఉంటుంది. దాన్ని మంచిగా మ‌రిగించి తాగుతారు. ప్యూర్ టీని తాగేందుకే వారు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక బ్రిటీష్ వారు కూడా మ‌న‌లానే టీలో పాలు క‌లుపుతారు. కానీ చాలా త‌క్కువ మోతాదులోనే ఉంటుంది. మ‌న‌లాగా చిక్క‌ని పాల‌ను క‌ల‌ప‌డం, బాగా మ‌రిగించ‌డం వంటివి చేయ‌రు. అందుకే విదేశీయుల టీకి, మ‌న టీకి టేస్ట్‌లో అయినా, సువాస‌న‌లో అయినా చాలా తేడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

Telangana FSL office fire| నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Waste to Wealth | ప్లాస్టిక్ వ్య‌ర్థాలే వారి జీవ‌నోపాధి.. నెల‌కు రూ. 7 వేలు సంపాదిస్తున్న మ‌హిళ‌లు