Karimnagar | జడ్పీలో గల్ఫ్ మృతులకు సంతాప తీర్మానం చేయాలి: గల్ఫ్ JAC

Karimnagar గల్ఫ్ మరణాలను 'ఆన్ డ్యూటీ డెత్'గా పరిగణించాలి విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ పేరిట ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో… గల్ఫ్ దేశాలలో మృతి చెందిన తెలంగాణ వలస కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించి, సంతాప తీర్మానం చేయాలని గల్ఫ్ జెఏసి వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టింది. జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో… గల్ఫ్ దేశాలలో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, సంస్మరణ […]

Karimnagar | జడ్పీలో గల్ఫ్ మృతులకు సంతాప తీర్మానం చేయాలి: గల్ఫ్ JAC

Karimnagar

  • గల్ఫ్ మరణాలను ‘ఆన్ డ్యూటీ డెత్’గా పరిగణించాలి

విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరుల సంస్మరణ పేరిట ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో… గల్ఫ్ దేశాలలో మృతి చెందిన తెలంగాణ వలస కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించి, సంతాప తీర్మానం చేయాలని గల్ఫ్ జెఏసి వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టింది.

జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో… గల్ఫ్ దేశాలలో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, సంస్మరణ తీర్మానం చేయాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తో సహా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలకు గల్ఫ్ జెఏసి బృందం వినతిపత్రాలు సమర్పించింది.

గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ సాజిద్, కార్మిక నాయకులు నల్లాల జయపాల్ తదితరులతో కూడిన బృందం గురువారం ఉదయం మల్యాల జడ్పీటీసీ కొండపల్కల రామ్మోహన్ రావును ఆయన స్వగ్రామం పోతారంలో కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.

కొడిమ్యాల జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి కృష్ణారావును జగిత్యాలలో ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. మేడిపల్లి జడ్పీటీసీ, జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ వొద్ధినేని హరిచరణ్ రావు జగిత్యాల నివాసంలో అందుబాటులో లేనందున వినతిపత్రాన్ని గోడకు అతికించి వాట్సాప్ లో పంపారు.

తెలంగాణ వలస కార్మికులు తమ కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు ఒంటరిగా వలస వెళుతున్నారని, దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల మాదిరిగానే గల్ఫ్ కార్మికులు కూడా స్వగ్రామాలకు దూరంగా ఉంటున్నారని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాల నుండి విదేశీ మారక ద్రవ్యం పంపుతూ భారత దేశానికి ఆర్థిక జవాన్లు గా పని చేస్తున్నారని అన్నారు.

గల్ఫ్ కార్మికులు ఏళ్ల తరబడి మాతృదేశానికి దూరంగా ఉంటూ వివిధ కారణాల వలన మృత్యువాత పడుతున్నారని, విదేశాల్లో జరిగే ప్రతి మరణాన్ని ‘ఆన్ డ్యూటీ డెత్’ (విధినిర్వహణలో మృతి) గా పరిగణించి వారికి గల్ఫ్ అమరులు’ (గల్ఫ్ మార్టియర్స్) గా గౌరవం ఇవ్వాలని భీంరెడ్డి కోరారు.

బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదంతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుండి ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాలలో గల్ఫ్ దేశాలలో 1,800 మంది తెలంగాణ వలస కార్మికులు చనిపోయారని గల్ఫ్ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వదేశ్ పరికిపండ్ల అన్నారు.

గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో ‘సహజ మరణం’ ను కూడా చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని స్వదేశ్ కోరారు.