Karimnagar | యూనిఫాం సివిల్ కోడ్ ఆచరణలో సాధ్యం కానీ అంశం: హాఫీజ్ సయ్యద్
Karimnagar దేశ సమైక్యత, సమగ్రతకు ప్రమాదకరం సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్ విధాత బ్యూరో, కరీంనగర్: యూనిఫాం సివిల్ కోడ్ అనవసరమైన అంశమని, ఆచరణకు సాధ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశ సమైక్యత, సమగ్రతకు చాలా ప్రమాదకరమని సున్ని మర్కజీ మీలాత్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ అన్నారు. మంగళవారం హాఫిజ్ యూసుఫ్ మాట్లాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని ఎన్నికల వేళ తెరపైకి […]

Karimnagar
- దేశ సమైక్యత, సమగ్రతకు ప్రమాదకరం
- సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్
విధాత బ్యూరో, కరీంనగర్: యూనిఫాం సివిల్ కోడ్ అనవసరమైన అంశమని, ఆచరణకు సాధ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశ సమైక్యత, సమగ్రతకు చాలా ప్రమాదకరమని సున్ని మర్కజీ మీలాత్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ అన్నారు. మంగళవారం హాఫిజ్ యూసుఫ్ మాట్లాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని ఎన్నికల వేళ తెరపైకి తీసుకొచ్చి.. సమాజంలో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య, వారి రాజకీయ అవసరాల కోసం గందరగోళం సృష్టించే కుట్రగా అభివర్ణించారు.
మన దేశం, బహుళ మతాలు, విభిన్న సంస్కృతుల మేళవింపని, బహుభాషలు మాట్లడే దేశమని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ఔన్నత్యమన్నారు. సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, దేశ రాజ్యాంగ నిర్మాతలు, మతపరమైన, సాంస్కృతిక స్వేచ్ఛను ప్రాథమిక హక్కులుగా పరిరక్షించారని, (ఆర్టికల్స్ 25, 26) ఇంకా, రాజ్యాంగంలోని అధికరణలు A) 371), 371(G) ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు, వారి కుటుంబ చట్టాలను హరించే ఏ చట్టంలో పార్లమెంటు వేలు పెట్టదన్నారు.
ఈ చట్టం షరియా, ఖురాన్, సున్నత్‌ల నుండి ఉద్భవించిందని, ఇందులో ముస్లింలకు షరియత్ లో మార్పులు చేయడానికి ఎవరికీ అధికారం లేదని చెప్పారు. ఇతర మతస్థులు, సాంస్కృతిక సమూహాలు కూడా వారి సాంప్రదాయ, సాంస్కృతిక విలువలను గౌరవిస్తాయి కాబట్టి ప్రభుత్వం లేదా ఏదైనా బాహ్య మూలం నుండి వ్యక్తిగత చట్టాలలో మార్పు సమాజంలో గందరగోళానికి, హింసకు దారి తీస్తుందని, ప్రభుత్వం నుండి ఎలాంటి న్యాయం పొందలేక పోతామన్నారు.
ఇది రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని వాదించే వారికి, భారత రాజ్యాంగంలోని మార్గదర్శకాల అధ్యాయం IVలో ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పనిసరి కాదని స్పష్టం చేయడం జరిగిందన్నారు. మార్గదర్శకాలలో మాదకద్రవ్య వ్యసనంపై నిషేధం, దేశంలో ప్రజా ప్రయోజనాల కోసం, అనేక చట్టాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటి అమలు గురించి పట్టించుకోనప్పటికీ, దానికి విరుద్ధంగా, మతపరమైన, సాంస్కృతిక స్వేచ్ఛ అనేది ప్రాథమిక తప్పనిసరి హక్కు అన్నారు.
ఏదైనా మతపరమైన వ్యక్తిగత చట్టానికి కట్టుబడి ఉండకూడదనుకునే వారికి, దేశంలో ఇప్పటికే ప్రత్యేక వివాహ చట్టం, వారసత్వ చట్టం రూపంలో ఐచ్ఛిక సివిల్ కోడ్ ఉంది. ప్రస్తుతం యూనిఫాం సివిల్ కోడ్ చర్చ అనవసర మైందన్నారు. ముస్లింలు తమ షరియా విషయంలో రాజీ పడరని, లాకమిషన్‌కు స్పష్టం చేయాలని, ముస్లింలకు చెందిన ధార్మిక సంస్థల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
దేశంలోని అన్ని సాంస్కృతిక విభాగాలు, మేధావులు, పౌర సమాజం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి, ఈ పనికిరాని యూనిఫామ్ సివిల్ కోడ్ నుండి దేశాన్ని కాపాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.