Kavitha : తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో భూములు ఆక్రమించి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Kavitha : తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి

విధాత : తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల స్థలం ఇవ్వాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ లో మానకొండూర్ లో 5ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలతో కలిసి ఆక్రమించి జెండాలు పాతారు. గుడిసెలు వేశారు. వేసిన కొత్త గుడిసెల్లో ఉద్యమకారుల కుటుంబాలతో కలిసి పాలు కూడా పొంగించి వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పోరాటాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం అని.. అదే స్పూర్తితో ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చే వరకు పోరాడుతాం అన్నారు. అన్ని జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఇంటి స్థలాల కోసం ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు.

కరీంనగర్ నుండి ప్రారంభం అయిన పోరాటం… రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉద్యమకారులను ఏకం చేసి పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా పోరాడుతాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 250గజాల ఇంటి స్థలం ఇస్తామని, పెన్షన్ ఇస్తామని, సంక్షేమ బోర్డు పెడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని..ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాగృతి పోరాడుతుందన్నారు. ప్రభుత్వం ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రతి జిల్లాలో ఇందుకోసం జాగృతి భూములను గుర్తించిందని కవిత తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Good Luck Grapes : గుడ్ లక్ గ్రేప్స్…ట్రెండింగ్ లో న్యూఇయర్ 12గ్రేప్స్ థియరీ
Prabhas | ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. క‌ల్కి 2పై క్రేజీ అప్‌డేట్..!