Good Luck Grapes : గుడ్ లక్ గ్రేప్స్…ట్రెండింగ్ లో న్యూఇయర్ 12గ్రేప్స్ థియరీ

న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 ద్రాక్షలు తింటే 12 నెలలు అదృష్టం కలిసివస్తుందన్న స్పానిష్ ‘12 గ్రేప్స్ థియరీ’ భారత్‌లో ట్రెండ్ అవుతోంది.

Good Luck Grapes : గుడ్ లక్ గ్రేప్స్…ట్రెండింగ్ లో న్యూఇయర్ 12గ్రేప్స్ థియరీ

విధాత : న్యూఇయర్ వేడుకల వేళ ప్రజలు తమకు అంతా మంచి జరుగాలని కోరుకుంటు దైవ ప్రార్ధనలతో పాటు నచ్చిన సెంటిమెట్లను ఫాలో అవుతుంటారు. అలాంటి వాటిలో 12గ్రేప్స్ థియరీ స్పానిష్ ఆచారం ఒకటి. కొత్త సంవత్సరానికి స్వాగతించే క్రమంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటలకు 12గ్రీన్ గ్రేప్స్( పచ్చ ద్రాక్షలు) తింటే మనసులోని కోరికలు కొత్త సంవత్సరంలో నెరవేరుతాయన్న నమ్మకం స్పెయిన్ లో ప్రాచీన కాలపు అచారంగా కొనసాగుతుంది. సంప్రదాయం ప్రకారం పన్నెండు ద్రాక్షలను తినడం వల్ల 12నెలల సంవత్సరం అంతా అదృష్టం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వసిస్తారు. ఒక ద్రాక్షను ఒక నెలగా..ఒక కోరికగా భావిస్తారు. న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా ఈ ప్రాచీన స్పానిష్ ఆచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎలా చేయాలో తెలుసా!

12 ద్రాక్షల ఆచారం అమలు చేయడం ఎలాగంటే..సరిగ్గా డిసెంబర్ 31న అర్ధరాత్రి టేబుల్ మీద ఒక ప్లేట్ లో 12 గ్రీన్ ద్రాక్ష పండ్లను పెట్టుకోవాలి. 12గంటలకు మనసులోని కోరికలను తలుచుకుని నిమిషానికి ఒక ద్రాక్ష చొప్పున తినాలి. ఇలా తింటూ తమ కోరికలను బలంగా సంకల్పించుకుంటే కొత్త ఏడాదిలో కోరికలు నేరవేరుతాయని..అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.

ఇప్పుడు భారత్ లోకి 12గ్రేప్స్ థియరీ

నిజానికి స్పెయిన్ లో ఆ సమయానికి వచ్చే ద్రాక్ష పంట అధిక ఉత్పత్తి కారణంగా ద్రాక్ష అమ్మకాలను ప్రోత్సహించడానికి ఈ ఆచారాన్ని వ్యాప్తి చేశారు. క్రమంగా 12గ్రేప్స్ 12విషెస్ ఆచారం స్పెయిన్ తో సాంస్కృతిక సంబంధాలు ఉన్న ఫిలిప్పీన్స్, లాటిన్ అమెరిన్, కరేబియన్ దేశాలు, అమెరికా వంటి పలు దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు భారత్ లోనూ ఈ సంస్కృతి విస్తరిస్తుండటం గమనార్హం. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెజాన్, జోమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు భారత్ దేశం ఓ మార్కెట్ వస్తువుగా మారింది. ఈ నేపథ్యంలో తమ విక్రయాలను పెంచుకునే ఎత్తుగడలో భాగంగా విదేశీ సంస్కృతులను, సెంటిమెంట్లను ప్రమోట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 12గ్రేప్స్ థియరీ సెంటిమెంట్ భారత్ లోకి దూసుకొచ్చింది. ఆ వెంటనే ఆయా ఆన్ లైన్ మార్కెట్ లలో గ్రేప్స్ ధరలు అమాంతంగా పెంచేయడం ఈ సందర్భంగా గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Prabhas | ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. క‌ల్కి 2పై క్రేజీ అప్‌డేట్..!
Sridevi | అతిలోక సుందరి శ్రీదేవి.. తెర వెనుక తెలియని రేర్ ఫ్యాక్ట్స్, సంచలన ట్విస్టులు