Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. కల్కి 2పై క్రేజీ అప్‌డేట్..!
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా నిలిచింది. 2024 జూన్‌లో విడుదలైన ఈ చిత్రం మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ల సమ్మేళనంతో ప్రేక్షకులను కట్టిపడేసి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా నిలిచింది. 2024 జూన్‌లో విడుదలైన ఈ చిత్రం మైథాలజీ, సైన్స్ ఫిక్షన్‌ల సమ్మేళనంతో ప్రేక్షకులను కట్టిపడేసి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ గ్లోబల్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించగా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్లు గెస్ట్ అప్పీరెన్స్‌లతో మెరిశారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి పార్ట్–2’ పై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. తొలి భాగం ముగిసిన విధానం చూసిన ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ భాగంలో ముఖ్యంగా ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ మధ్య జరిగే ఎపిక్ యుద్ధ సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్ సీక్వెన్స్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సెట్లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రత్యేక షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ 2026 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ షూటింగ్‌లోనూ ఆయన పాల్గొంటున్నారు. రాజా సాబ్ విడుదలైన వెంటనే కల్కి 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేలా షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు టాక్. మరోవైపు కల్కి 2 హీరోయిన్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీపికా పదుకొణె ఈ సీక్వెల్‌లో కొనసాగుతారా? లేక ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ వస్తారా? అన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది. అనుష్క శెట్టి, ప్రియాంక చోప్రా, సాయిపల్లవి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే కల్కి పార్ట్–2 అప్‌డేట్స్ డార్లింగ్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయనే చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram