Nag Ashwin : ప్రధాని మోదీకి దర్శకుడు నాగ్ అశ్వీన్ కీలక ట్వీట్

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. రూ.250లోపు సినిమా టికెట్లపై 5% జీఎస్టీ అమలు చేస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందన్నారు.

Nag Ashwin : ప్రధాని మోదీకి దర్శకుడు నాగ్ అశ్వీన్ కీలక ట్వీట్

విధాత : జీఎస్టీ సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు శ్లాబుల ప్రస్తుత పద్దతిని ఎత్తివేసి.. రెండు స్లాబ్ ల విధానంతో ప్రజలపై పన్నుల భారం తగ్గించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోదీకి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, చిన్న పట్టణాల్లోని సినిమా హాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా రూ.100లోపు ఉన్న సినిమా టికెట్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. రూ.100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 18 శాతం జీఎస్టీ వసూలు కొనసాగుతుంది.

అయితే రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై మాత్రమే భారం తగ్గుతుండడం ద్వారా చిత్ర పరిశ్రమకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మల్టీప్లెక్స్, ప్రీమియం థియేటర్లలోని టికెట్లపై కూడా జీఎస్టీ భారాన్ని తగ్గించేలా నిర్ణయం తీసుకుంటే సినీ రంగానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని సీనీ పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో ట్వీట్ ద్వారా కీలక విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తునే..5శాతం జీఎస్టీ శ్లాబ్ ను కేవలం రూ. 100లోపు టికెట్లకే కాకుండా రూ.250టికెట్ల వరకు పొడిగిస్తే బాగుంటుందని సూచించారు. అలా చేస్తే సినీ పరిశ్రమ, థియేటర్లు అభివృద్ధి చెందడంతో పాటు మధ్య తరగతి ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి ఎంతో ప్రయోజనకరమవుతుందన్నారు. ప్రస్తుతం చాల తక్కువ థియేటర్లు మాత్రమే రూ.100లోపు టికెట్లు విక్రయిస్తున్నాయని..ఈ నేపథ్యంలో రూ.250టికెట్ల వరకు 5శాతం జీఎస్టీని అమలు చేయాలని నాగ్ అశ్విన్ ప్రధాని మోదీని కోరారు.