• Telugu News
  • /Latest news

Municipal Elections pensioner letter viral| మున్సిపల్ ఎన్నికలలో సిత్రం..బ్యాలెట్ బాక్స్‌లో పెన్షనర్ లెటర్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా బ్యాలెట్ బాక్స్ లో వెలుగు చూసిన సిత్రాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సూర్యాపేట 47 వార్డులోని బ్యాలెట్ బాక్స్‌లో ప్రత్యక్షమైన ఓ లేఖ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 13, 2026, 7:06 pm IST
Read Time: 5 mins
Municipal Elections pensioner letter viral| మున్సిపల్ ఎన్నికలలో సిత్రం..బ్యాలెట్ బాక్స్‌లో పెన్షనర్ లెటర్

విధాత : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల ప్రచారంలో చేసిన రకరకాల ప్రయత్నాలు ఇప్పటిదాకా చూశాం. అయితే ఓట్ల లెక్కింపు రోజున శుక్రవారం బ్యాలెట్ బాక్స్ లో వెలుగు చూసిన ఓటర్ల సిత్రాలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సూర్యాపేట 47 వార్డులోని బ్యాలెట్ బాక్స్‌లో ప్రత్యక్షమైన ఓ లేఖ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది.

తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ పెన్షనర్ లెటర్ రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. ఓట్ల లెక్కింపు సందర్బంగా కౌంటింగ్ సిబ్బంది ఆ లేఖను గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. లేఖలో ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా ..మేం రిటైర్మెంట్ అయి 15నెలలు గడిచిందని.. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన డబ్బులు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో అనేక ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు పడుతున్నామని బాధిత పెన్షనర్ తన ఓటుతో పాటు లేఖను బ్యాలెట్ బాక్స్ లో వేశాడు. ఇప్పటికే పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు రాక 62 మంది చనిపోయాని మేము కూడా చనిపోక ముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని లేఖలో పెన్షనర్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

లక్సెట్టిపేట మున్సిపాల్లీలోనూ మరో లేఖ

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డు బ్యాలెట్ బాక్సులో, తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనిరి టైర్డ్ ఉద్యోగి సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ కౌంటింగ్ సందర్భంగా వెలుగు చూసింది. మా రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు తగిన మూల్యం చెల్లిస్తారు అని బాధిత పెన్షనర్ హెచ్చరించాడు. కేటీఆర్‌ను సీఎం కుర్చీ నీ అయ్య జాగీరా అంటున్నావు, మరి సీఎం కుర్చీ నీ జాగీరా, నీ మామ జాగీరా అని మేము అడుగుతున్నామంటూ లేఖ లో ప్రశ్నించాడు.

రూ.15 వేల కోట్ల మేరకు పెరుగనున్న పెండింగ్ బకాయిలు

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.700 కోట్లు విడుదలవుతున్నా, మొత్తం బకాయిలు సుమారు రూ.9,000 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయనుండటంతో పెన్షనర్ల భారం మరింత పెరగనుంది. వీరందరికీ చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి రిటైర్​మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెండింగ్‌‌లో ఉన్న రూ.9 వేల కోట్ల బకాయిలకు తోడు, కొత్తగా వచ్చే రూ.6 వేల కోట్ల అవసరాలను కలుపుకుంటే, మొత్తం రూ. 15 వేల కోట్ల మేర నిధులు సమకూర్చాల్సి ఉంది. అసలే ఆర్థిక ఇబ్బందులు, ఆదాయ, వ్యయాల మధ్య భారీ లోటు, గత అప్పుల వడ్డీ భారం, పెరిగిపోతున్న కొత్త అప్పుల నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది.