Karnataka | నామినేషన్ కోసం రూపాయి నాణేలను సమర్పించిన స్వతంత్ర అభ్యర్థి
Karnataka | కర్ణాటక విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించే డిపాజిట్ కింద ఓ స్వతంత్ర అభ్యర్థి అన్నీ రూపాయి నాణేలను సమర్పించాడు. ఇప్పుడు ఆ యువకుడు వార్తల్లో నిలిచాడు. యాద్గిర్ నియోజకవర్గం నుంచి యంకప్ప అనే యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే ఆ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి అన్ని రూపాయి నాణేలను సేకరించాడు. రూ. […]

Karnataka | కర్ణాటక విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించే డిపాజిట్ కింద ఓ స్వతంత్ర అభ్యర్థి అన్నీ రూపాయి నాణేలను సమర్పించాడు. ఇప్పుడు ఆ యువకుడు వార్తల్లో నిలిచాడు.
యాద్గిర్ నియోజకవర్గం నుంచి యంకప్ప అనే యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే ఆ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి అన్ని రూపాయి నాణేలను సేకరించాడు. రూ. 10 వేల నాణేలను సేకరించి, ఇవాళ నామినేషన్‌తో పాటు ఆ నాణేలను డిపాజిట్ చేశాడు. ఆ నాణేలను ఎన్నికల అధికారులు రెండు గంటల పాటు లెక్కించాల్సి వచ్చింది. అన్ని రూపాయి నాణేలు సమర్పించడంతో వార్తల్లోకి ఎక్కాడు యంకప్ప.
ఇక యంకప్ప నామినేషన్ సమర్పించేందుకు మంగళవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. అది కూడా వినూత్నంగా అక్కడకు వచ్చాడు యంకప్ప. మెడలో ఓ బ్యానర్‌ను చుట్టుకున్నాడు. ఆ బ్యానర్‌పై 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడు, కర్ణాటక కవి కనకదాసు, స్వామి వివేకానంద, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోలను ఏర్పాటు చేశాడు. ఆ ఫోటోల కింద ఓ సందేశం కూడా రాశాడు.
ఆ సందేశం ఏంటంటే.. ఇది ఒక్క రూపాయి కాదు.. ఇది మీ యొక్క ఓటు. మీరు నాకు ఒక రోజు ఓటు వేయండి.. మిమ్మల్ని పేదరికం నుంచి విముక్తి చేస్తాను అని యంకప్ప కన్నడ భాషలో రాసుకొచ్చాడు.
యంకప్ప గుల్బార్గా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశాడు. అతని మొత్తం ఆస్తి రూ. 60 వేలు కాగా, తన తండ్రి దేవేంద్రప్ప పేర ఒక ఎకరా 16 గుంటల భూమి మాత్రమే ఉన్నట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు యంకప్ప.