Karnataka | కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా

Karnataka పది మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ విధాత: బెంగుళూరులో విపక్షాల ఇండియా కూటమి భేటీకి హాజరైన నాయకులకు స్వాగతం తెలిపేందుకు IASలను వినియోగించడంపై కర్నాటక అసెంబ్లీలో BJP చేపట్టిన నిరసన ఆ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు దారితీసింది. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే IASల వినియోగం అంశంపై చర్చకు BJP ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే స్పీకర్ అందుకు అనుమతించకుండా బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో BJP సభ్యులు సభలో నిరసనకు దిగి స్పీకర్ పోడియం […]

  • By: krs |    latest |    Published on : Jul 19, 2023 12:45 PM IST
Karnataka | కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా

Karnataka

  • పది మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

విధాత: బెంగుళూరులో విపక్షాల ఇండియా కూటమి భేటీకి హాజరైన నాయకులకు స్వాగతం తెలిపేందుకు IASలను వినియోగించడంపై కర్నాటక అసెంబ్లీలో BJP చేపట్టిన నిరసన ఆ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు దారితీసింది. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే IASల వినియోగం అంశంపై చర్చకు BJP ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే స్పీకర్ అందుకు అనుమతించకుండా బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.

దీంతో BJP సభ్యులు సభలో నిరసనకు దిగి స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రుద్రప్పపై పేపర్లు విసిరారు. స్పీకర్ గౌరవానికి భంగం కల్గించారన్న అభియోగాలతో పది మంది BJP ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మార్షల్స్ సస్పెండైన BJP ఎమ్మెల్యేలను సభ నుండి బలవంతంగా బయటకు తరలించారు. సభా ప్రాంగణంలో BJP ఎమ్మెల్యేలు కొద్ది సేపు తమ నిరసన కొనసాగించారు.