Medak: మూడో సారి అధికారంలోకి BRS.. మళ్లీ కేసీఆరే CM: MLA పద్మాదేవేందర్‌రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి మళ్లీ బిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్న శంకరంపేటలోని శ్రీనివాస గార్డెన్‌లో చిన్న శంకరంపేట మండలం క్లస్టర్, 14 గ్రామాల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి […]

విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి మళ్లీ బిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్న శంకరంపేటలోని శ్రీనివాస గార్డెన్‌లో చిన్న శంకరంపేట మండలం క్లస్టర్, 14 గ్రామాల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహిళలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఎగ్గు మల్లేశంకు బొట్టు పెట్టి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు చిన్న శంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గు మల్లేషం నివాళులర్పించారు.
అనంతరం వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పులతో డీజే పాటలతో టపాకాయల శబ్దాలతో చిన్న శంకరంపేట పట్టణం దద్దరిల్లింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డప్పు కొట్టి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి తోమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల కరెంటు అందిస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. త్వరలోనే చిన్న శంకరంపేట మండలానికి కాలేశ్వరం నీళ్లు వస్తాయి అని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలే నాకు బలగమన్నారు.