Jagadish Reddy | హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్: మంత్రి జగదీశ్ రెడ్డి
Jagadish Reddy | విధాత: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆరెస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి యావత్ ప్రజానీకం బీఆరెస్ వైపు చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సూర్యాపేట మండల పరిధిలోని రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి […]

Jagadish Reddy |
విధాత: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆరెస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి యావత్ ప్రజానీకం బీఆరెస్ వైపు చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
సూర్యాపేట మండల పరిధిలోని రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి అహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిన బీఆరెస్ ప్రభుత్వం తిరుగులేని శక్తిగా ఆవిర్భావించిందన్నారు. మరో 20 ఏండ్లు తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉండేది బీఆరెస్ పార్టీయే నని ఆయన పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారిలో ట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్స సైదులు గౌడ్, మాజి గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలోజు మధుసూధనాచారి, సైదుల మల్లేష్, సైదుల మహేష్, కేసాని శ్రీను, కప్పల నాగరాజు, పబ్బు రాములు, నక్కల మధుసూదన్, కప్పుల ఉపేందర్ ,సైదుల వెంకన్న తదితరులు ఉన్నారు.