Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ ..వారిద్ధరికి రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ లపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా భారత్ కు ఇద్దరిని రప్పించేందుకు కేం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ ..వారిద్ధరికి రెడ్ కార్నర్ నోటీసులు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్నఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక పురోగతి సాధించారు. ఇంటర్ పోల్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ లపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది.

వీలైనంత త్వరగా భారత్ కు ఇద్దరిని రప్పించేందుకు కేంద్ర హోం శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి డీహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్(తాత్కలిక) అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితుల డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించనున్నట్లుగా సమాచారం. ప్రోవిజనల్ అరెస్టును నిందితులు అమెరికా న్యాయస్థానాల్లో సవాలు చేస్తే మాత్రం వారి అరెస్టు మరింత ఆలస్యం కాక తప్పదు.

నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు గతేడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసు విచారణ ముందుకు సాగాలంటే..కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలంటే…ఆ ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల కోర్టు ప్రశ్నించడంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు.