ఇప్పటికీ కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ : మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని ఆరోపించారు.

ఇప్పటికీ కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ : మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో అధికార దుర్వినియోగంతో సాగించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేటికి ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో నేను మాట్లాడిన ఫోన్ కాల్ ట్యాపింగ్ నిదర్శనమని పొంగులేటి వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్‌ ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానం ఉంది అన్నారు. మా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందన్నారు.

కార్పొరేటర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్ లో నేను ఏం మాట్లాడానో ట్యాపింగ్ చేసి విన్నారు అని, నేను ఉద్యోగ సంఘం నాయకులతో మాట్లాడిన మాటలు ఎలా విన్నారో విచారణ చేస్తాం అని తెలిపారు. బీఆర్ఎస్ పెద్దల వద్ద ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని ఆరోపించారు. ఏ మామిడి తోటలలో, ఫామ్ హౌస్ లలో ట్యాపింగ్ పరికరాలు పెట్టి అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో దర్యాప్తు చేస్తామని, చట్టపరంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్టులు, సెలబ్రెటీలు, భార్యభర్తల ఫోన్లను కూడా బీఆర్ఎస్ పాలకులు అప్పట్లో ట్యాపింగ్ చేశారని..ఇప్పటికి కూడా వారి వద్ద ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయన్న అనుమానాలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Loksabha Speaker Om Birla : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్
HCU | హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో భారీ చోరీ.. 50 ల్యాప్‌టాప్‌లు మాయం