Tomato | కిలో టమాటా రూ. 224.. ఎక్కడంటే..?
Tomato | టమాటా ధరలు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకు టమాటా ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా రూ. 200 వరకు పలికింది. కానీ తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా రూ. 224 పలికింది. నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో ధర పలకడంతో.. టమాటా పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు పది వేల క్రేట్ల సరకు రాగా, వేలంలో క్రేటు […]
Tomato | టమాటా ధరలు తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకు టమాటా ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా రూ. 200 వరకు పలికింది. కానీ తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటా రూ. 224 పలికింది. నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో ధర పలకడంతో.. టమాటా పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు పది వేల క్రేట్ల సరకు రాగా, వేలంలో క్రేటు ధర రూ. 5,600గా పలికినట్లు టీవీఎస్ మండి యజమాని బాబు, మేనేజర్ షామీర్ తెలిపారు. మదనపల్లె మార్కెట్ నుంచి టమాటాను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు.
అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్ మండీలో 15 కిలోల బుట్ట అనూహ్యంగా రూ. 3,200కు అమ్ముడుపోయింది. అంటే కిలో టమాటా రూ. 215. ఈ సీజన్‌లోనే కాదు.. ఈ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావొచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram